శనిదేవుని విగ్రహాన్ని ఇంట్లో ఎందుకు పెట్టకూడదు ? షాకింగ్ నిజాలు !

మనం ఇంట్లో చాలామంది దేవతా మూర్తుల చిన్న విగ్రహాలను లేదా ఫోటోలను పెట్టి పూజిస్తాం.

Update: 2024-01-28 09:06 GMT
శనిదేవుని విగ్రహాన్ని ఇంట్లో ఎందుకు పెట్టకూడదు ? షాకింగ్ నిజాలు !
  • whatsapp icon

దిశ, ఫీచర్స్ : మనం ఇంట్లో చాలామంది దేవతా మూర్తుల చిన్న విగ్రహాలను లేదా ఫోటోలను పెట్టి పూజిస్తాం. కానీ శనిదేవుని విగ్రహాన్ని లేదా ఫోటోను పూజించరు. మతపరమైన కథల ప్రకారం శని దేవుణ్ణి న్యాయ దేవుడుగా భావిస్తారు. శనివారం శనికి అంకితం చేశారు. శనిదేవున్ని ప్రసన్నం చేసుకుంటే సకల సౌభాగ్యాలు, ఆయువు, ఆరోగ్యాలు చేకూరుతాయని, అదృష్టం తలుపుతడుతుందని పండితులు చెబుతున్నారు. ఒకవేళ శని దేవుడి చెడు దృష్టి మన మీద ఉంటే ఆ వ్యక్తి తన జీవితంలో దుఃఖాన్ని,సమస్యలను ఎదుర్కొంటాడు. అందుకే చాలామంది శనిదేవుని అనుగ్రహం కోసం శని దేవాలయానికి వెళ్లి శని దేవుడికి ప్రదక్షిణలు చేసి పూజలు చేస్తారు.

అయితే ఇంటిలోని పూజ గదిలో అన్ని దేవుళ్ల ప్రతిమలు, ఫోటోలు పెట్టుకున్నా ఎంతో శక్తివంతుడైన శనిదేవుని చిత్రాన్ని మాత్రం పెట్టుకోరు. ఎందుకంటే హిందూ విశ్వాసాల ప్రకారం ఇంట్లో శని దేవుడి విగ్రహం ఫోటో ఉంచడం అశుభమని భావిస్తారు. శనిదేవుని విగ్రహాన్ని ఇంట్లో ఉంచకపోవడం వెనుక ఒక పురాణ కథ ఉంది. దాని ప్రకారం శనిదేవుని చూపు ఎవరి పై పడుతుందో అతనికి అశుభాలు జరుగుతాయని శపించారు.

పురాణాల ప్రకారం..

పురాణాల ప్రకారం శని దేవుడు కృష్ణ భగవానుడికి గొప్ప భక్తుడు. ఎల్లప్పుడూ అతని భక్తిలో మునిగి ఉండేవాడు. ఒకసారి శనిదేవుని భార్య అతన్ని కలవడానికి వచ్చింది. ఆ సమయంలో కూడా శని దేవుడు శ్రీకృష్ణుని ధ్యానంలో మునిగిపోయాడు. శని దేవుని భార్య ఎన్ని ప్రయత్నాలు చేసినా శని దేవుని ఏకాగ్రత విచ్ఛిన్నం కాలేదు.

దీంతో అతని భార్య కోపోద్రిక్తురాలై ఈరోజు నుంచి శనిదేవుని ఇంట్లో పెట్టుకుని పూజించినా, శని కన్ను ఎదుటివారిపై పడినా అరిష్టం తప్పదని శనిదేవుడిని శపించింది. ఆ తరువాత శని దేవుడు తన తప్పును గ్రహించి తన భార్యకు క్షమాపణ చెప్పాడు. కానీ అతని భార్యకు శాపాన్ని వెనక్కి తీసుకునే శక్తి లేదు. ఈ కారణంగా అప్పటి నుండి శని దేవుని చూపు ఎవరి పై పడకుండా తల వంచుకుని నడిచేవారట.

శని దేవునికి అతని భార్య ఇచ్చిన శాపం కారణంగా ఇంట్లో శనిదేవుని చిత్రం లేదా విగ్రహాన్ని పెట్టుకోరు. దీంతో ప్రజలు శని దృష్టికి దూరంగా ఉంటారు. శనిదేవుని దేవాలయాలలో శనిదేవుని శిలను పూజిస్తారు. శని దేవుడి విగ్రహం కళ్లలోకి చూడకూడదని, శని దేవుడి కమల పాదాలను మాత్రమే చూడాలని నమ్ముతారు.

Tags:    

Similar News