Gokulashtami : శ్రీకృష్ణుడు తనకు ఇష్టమైన వేణువును ఎందుకు విరగొట్టాడో తెలుసా..

ప్రపంచవ్యాప్తంగా కృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి.

Update: 2024-08-25 12:50 GMT

దిశ, వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డెస్క్ : ప్రపంచవ్యాప్తంగా కృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఈసారి జన్మాష్టమిని 26 ఆగస్టు 2024న జరుపుకోనున్నారు. అయితే శ్రీకృష్ణుడికి సంబంధించిన ప్రతి ఆలయంలో ఆయన చేతిలో ఖచ్చితంగా వేణువు ఉంటుంది. కృష్ణుడికి వేణువు అంటే చాలా ఇష్టమని, ఎప్పుడు వేణువు వాయించినా గోపికలు తనవైపు ఆకర్షితులయ్యారని పురాణాలు చెబుతున్నాయి. కృష్ణుడి వేణుగాణానికి సమస్త జీవులు మైమరచిపోయేవట. అయితే కృష్ణుడు తనకు అత్యంత ప్రీతిపాత్రమైన వేణువును పగలగొట్టి విసిరిన సందర్భం ఒకానొకసారి వచ్చింది. శ్రీ కృష్ణునికి ఎంతో ప్రీతిపాత్రమైన ఈ వేణువును ఇలా చేసేందుకు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పురాణ కథనం..

రాధకృష్ణుల ప్రేమ ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. నేటికీ కృష్ణుడి కంటే ముందు రాధ పేరే గుర్తుకు వస్తుంది. ప్రేమకు రాధాకృష్ణులనే ఉదాహరణగా చెప్పుకుంటారు. రాధాకృష్ణులు వివాహం చేసుకోకపోయినా గోపీనాధునికి రాధపై ప్రేమ, గౌరవం మరెవరి పై ఉండదట. రాధా కోసమే కృష్ణుడు వేణువు వాయించేవాడని కూడా పురాణాలు చెబుతున్నాయి. రాధకి కూడా కృష్ణుడు వాయించిన వేణువు వినడం చాలా ఇష్టం. వేణువు రాగం రాధ చెవులకు చేరగానే, ఆమె తన కన్నయ్యను కలవడానికి వచ్చేసేదట.

రాధను వదిలి మధుర వెళ్ళినప్పుడు..

శ్రీకృష్ణుడురాధ ఎప్పుడూ ఒకరిని విడిచి మరొకరు ఉండేవారు కాదు. కానీ కాలం వారిని దూరం చేసింది. శ్రీకృష్ణుడు తన బాధ్యతలను నెరవేర్చుకోవడానికి బృందావనాన్ని విడిచి మధురకు వెళ్లవలసిన సమయం వచ్చింది. దాంతో అతను రాధను కూడా విడిచి వెల్లవలసి వచ్చింది. వెళ్ళేటప్పుడు రాధ చివరి క్షణాల్లో కృష్ణుడిని తనకు ఒకసారి దర్శనం ఇస్తావా అని వాగ్దానం కోరింది. రాధ మాటను కృష్ణుడు కూడా అంగీకరించాడు. అతను రాధ నుండి దూరమయ్యాడు. కానీ ఎల్లప్పుడూ తన దగ్గరే వేణువును ఉంచుకున్నాడు.

వేణువు ఎందుకు పగలగొట్టారు ?

వాగ్దానం ప్రకారం రాధ చివరి క్షణాలు వచ్చినప్పుడు, ఆమె కృష్ణుడిని కలవాలని కోరుకుంది. ఆ సమయంలో కృష్ణుడు ద్వారకా నగరాన్ని స్థాపించి ద్వారకకు పాలకుడయ్యాడు. ఏళ్ల క్రితం ఇచ్చిన మాట నిలబెట్టుకుని రాధారాణిని కలిశాడు. ఈ లోకంలో రాధతో అతనికి ఇదే చివరి కలయిక. ఇచ్చిన మాట ప్రకారం కృష్ణుడు కూడా రాధా రాణి ముందు వేణువు వాయించాడు. వేణువు మధురమైన రాగం విని, రాధ కృష్ణుని భుజం పై తల ఉంచి, రాగం వింటూ తన జీవితాన్ని త్యాగం చేసింది. కృష్ణుడు ఈ బాధను భరించలేక రాధ ఎడబాటులో వేణువును విరిచి పొదల్లోకి విసిరాడు. దీని తరువాత కృష్ణుడు తాను ఎప్పటికీ వేణువును వాయించనని నిర్ణయించుకున్నాడట. అప్పటి నుంచి కన్నయ్య మళ్లీ ఎప్పుడూ వేణువును వాయించలేదని చెబుతారు.


Similar News