ఏ దేవుడికి బంతి పువ్వు ఇష్టం.. పూజలో బంతి పువ్వు ప్రాముఖ్యత ఏమిటో తెలుసా ?
బంతిపూలు, దాని దండలు దేవాలయాలలో లేదా పూజ సమయంలో వాడటం తరచుగా చూస్తూ ఉంటారు.
దిశ, ఫీచర్స్ : బంతిపూలు, దాని దండలు దేవాలయాలలో లేదా పూజ సమయంలో వాడటం తరచుగా చూస్తూ ఉంటారు. అంతే కాదు మీ ఇంట్లో జరిగే ప్రతి శుభకార్యానికి బంతి పువ్వులతో చేసిన దండను తప్పనిసరిగా వాడుతూ ఉంటారు. అలాగే పూజ సమయంలో వివిధ రకాల పుష్పాల కంటే బంతి పువ్వులను ఎక్కువగా వాడుతూ ఉంటారు. అసలు బంతి పువ్వులను ఎందుకు ప్రతి పూజలో ఉపయోగిస్తారని ఎప్పుడైనా ఆలోచించారా..? పూజలో బంతిపూలకు ఉన్న ప్రాముఖ్యత ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
హిందూ మతంలో ఒక్కో పుష్పం ఒక్కో ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. అదేవిధంగా, బంతి పువ్వుకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఆలయంలో జరిగే పూజ మొదలుకుని వివాహం, కలశ స్థాపన, గృహోపకరణం మొదలైన శుభ కార్యక్రమాలలో బంతిపూల మాలలను, అలాగే విడి బంతిపూలను తప్పనిసరిగా అలంకరిస్తారు.
నాయకత్వ లక్షణాలు..
దేవుడికి బంతిపూలు సమర్పించడం వల్ల జ్ఞానం, సంపదలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. బంతిపూవులో ఉండే మరో ప్రాముఖ్యత ఏంటంటే ఇది మనిషి అహంకారాన్ని తగ్గిస్తుంది. ఒక వ్యక్తికి మంచి నాయకుని లక్షణాలను కలిగిస్తుంది. దీనితో పాటు ఇంట్లో శుభం జరిగేందుకు ఇంటి తలుపులు, గుమ్మాలకు వద్ద బంతి పువ్వుల దండను కడతారు.
బంతి పువ్వులను ఏ దేవుడికి సమర్పించాలి ?
మహావిష్ణువుకు బంతిపూలు సమర్పించడం వల్ల సంతానం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. అలాగే గణపతి దేవుణికి కూడా పూజలో బంతి పువ్వులను సమర్పిస్తారు. బంతి పువ్వులో ఉండే ప్రతి రేకులో దేవతలు నివసిస్తారని పండితులు చెబుతున్నారు. ఇక గురువారం శ్రీ హరివిష్ణువుకు మర్రిచెట్టు పువ్వులు సమర్పించడం ద్వారా మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మహావిష్ణువు, గణేశుడు, తల్లి లక్ష్మి పూజలో బంతి పువ్వులు ఎక్కువగా ఉపయోగిస్తారు.