Ganesh Chaturthi : గణపయ్యకు ఏ రోజు ఏ పూజ చేయాలి.. వాటి పేర్లు ఏంటో తెలుసా?
హిందువుల ప్రధాన పండుగలలో వినాయక చవితి ఒకటి. ఈ రోజు సెప్టెంబర్ 18 వినాయక చవితి కావడంతో పట్టణాల్లో పండుగ వాతావరణం నెలకొంది.
దిశ, వెబ్‌డెస్క్: హిందువుల ప్రధాన పండుగలలో వినాయక చవితి ఒకటి. ఈ రోజు సెప్టెంబర్ 18 వినాయక చవితి కావడంతో పట్టణాల్లో పండుగ వాతావరణం నెలకొంది. నేటి నుంచి తొమ్మిది రోజులు వినాయకుని పూజించి పదో రోజు ప్రవహించే నదిలో నిమజ్జనం చేస్తారు. ఇక ఈ పది రోజులు నగరాలు, పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. భాద్రపద మాసంలో శుక్ల పక్షం చతుర్థి రోజున గణపతి జన్మిస్తాడు. అయితే ఈ పది రోజులు ఏ రోజు ఏ పూజ చేయాలి వాటిని ఏ పేరుతో పిలుస్తారో ఇక్కడ తెలుసుకుందాం.
* మొదటి రోజు అంటే ఈ రోజు 21 దళాలతో పత్రి పూజ చేయాలి.
* రెండో రోజు అష్టోత్తర శతనామావళి పూజ చేస్తే ఎంతో మంచిది.
* మూడవ రోజు పుష్పార్చన, చేసి కుటుంబమంతా కలిసి పూజ చేసుకోవాలి.
*అలాగే నాల్గవ రోజు సహస్రనామార్చన చేసుకోవాలి.
* ఐదో రోజున కల్యాణోత్సవం, ఆరవ రోజు విశేషమైన పడిపూజ చేయాలి.
*ఏడవ రోజు గణపతి పూజ, హోమం చేయాలి.
* ఏనిమిదవ రోజున సహస్ర మోదక పూజ, *తొమ్మిదవ రోజు చప్పన్ భోగ్ 56 రకాల పిండి వంటలతో నైవేద్యం చేసి సమర్పించాలి.
* పదవరోజు ఉద్వాసన పూజ చేసిన తర్వాత నిమజ్జనం చేయాలి.