Lunar Eclipse: ఈ ఏడాది తొలి చంద్ర గ్రహణ ఎప్పుడు ఏర్పడుతుంది అంటే?

సాధారణంగా గ్రహణాలు రెండు రకాలు అని అందరికి తెలిసిందే.

Update: 2025-03-01 08:13 GMT
Lunar Eclipse: ఈ ఏడాది తొలి చంద్ర గ్రహణ ఎప్పుడు ఏర్పడుతుంది అంటే?
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా గ్రహణాలు రెండు రకాలు అని అందరికి తెలిసిందే. అందులో భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు.. భూమి మీద కొంత భాగానికి సూర్యుడు పూర్తిగా గానీ, పాక్షికంగా గానీ కనబడకుండా పోవడం వలన సూర్య గ్రహణం (Solar eclipse) ఏర్పడుతుంది. అలాగే, చంద్రునికి సూర్యునికి మధ్య భూమి వచ్చినపుడు.. సూర్యుని కాంతి చంద్రునిపై పడదు. ఆ సమయంలో భూమిపై ఉన్నవారికి చంద్రుడు కనిపించడు. దీనిని చంద్ర గ్రహణం (Lunar Eclipse) అంటారు. ఇక ఈ ఏడాది (2025) తొలి చంద్ర గ్రహణం ఎప్పుడు ఏర్పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

2025లో తొలి చంద్ర గ్రహణం ఫాల్గుణ మాసం శుక్ల పక్షంలో వచ్చే పౌర్ణమి రోజు ఏర్పడుతుంది. అంటే.. మార్చి 14వ తేదీ. ఈరోజునే హోళీ పండగ (Holi Festival) కూడా రావడం విశేషం. అయితే, ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు. కేవలం ఉత్తర అమెరికా, పశ్చిమ ఆఫ్రికాలో కనిపిస్తుంది. ఈ కారణంగా ఈ చంద్రగ్రహణం సూత కాలం ఉండదు. గ్రహణం కనిపించినప్పుడే సూతకాలాన్ని పాటిస్తారు. ఇక ఈ చంద్రగ్రహణం.. భారత కాలమానం ప్రకారం మార్చి 14న ఉదయం 9 గంటల 27 నిమిషాలకు ప్రారంభమై ఉదయం 11 గంటల 56 నిమిషాలకు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది.

ఇక, ఈ ఏడాది రెండో చంద్ర గ్రహణం సెప్టెంబర్ 7న అంటే.. భాద్రపద మాసం శుక్ల పక్షంలో వచ్చే పౌర్ణమి రోజున ఏర్పడుతుంది. ఈ గ్రహణం రాత్రి 9:57 గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి 1:26 గంటలకు ముగుస్తుంది. ఈ గ్రహణం భారతదేశంతో సహా ఆసియా, ఆస్ట్రేలియా, యూరప్, న్యూజిలాండ్, పశ్చిమ, ఉత్తర అమెరికా, ఆఫ్రికా, దక్షిణ అమెరికాలోని తూర్పు ప్రాంతాలలో కనిపిస్తుంది.

Tags:    

Similar News