Vinayakudu: శివుడు ఖండించిన వినాయకుడి శిరస్సు ఎక్కడ ఉందో తెలుసా?

విఘ్న నాయకుడైన వినాయకుడుకు ఎన్నో ఆలయాలు ఉన్నాయి.

Update: 2023-03-13 02:40 GMT

దిశ, వెబ్ డెస్క్ : విఘ్న నాయకుడైన వినాయకుడుకు ఎన్నో ఆలయాలు ఉన్నాయి. తల్లి కోసం ద్వార పాలకుడిగా ఉన్నా పార్వతి పుత్రుని శిరస్సు మహా శివుడు ఖండించాడు. పార్వతి ద్వారా అతని పుత్రుడే అని తెలుసుకున్న శివుడు గజానుడుకు ఇచ్చిన వర ఆచరణలో భాగంగా తనతో తెచ్చిన గజము వినాయకుడికి శిరస్సుగా ఇచ్చి తిరిగి ప్రాణం పోసాడు. ఆ సమయంలో శివుడిడే ఖండింప పడే వినాయకుడు తల పడిన చోట తనే కాపలా ఉంటాడట. మరి ఇంతకు ఆ ప్రదేశం ఎక్కడ ఉందో తెలుసా ? ఉత్తరాఖండ్లోని సమీప ప్రాంతంలో భువనేస్వర్ అనే గ్రామం ఉంటుంది. అక్కడే పాతాళ భువనేశ్వర్ స్వామి ఆలయంలో వినాయకుడును, శివుడును దర్శించుకోవచ్చు. ఈ ఆలయం లోపలికి వెళ్లాలంటే 100 అడుగుల లోతు సుమారు 160 మీ పొడవు ఉన్న గుహలోకి కింద వరకు వెళ్ళాలి. చాలా మంది భక్తులు ఈ గుహలోకి వెళ్తుంటే.. కలిగే భయానికి వెనక్కి వచ్చేస్తుంటారు. ఈ పాతాళ భువనేశ్వర్ స్వామి ఆలయంలో ఒకప్పుడు పరమ శివుని నరికిన వినాయకుడి తల ఇప్పటికి మనకి కనిపిస్తుంది. అయితే అది విగ్రహ రూపంలో ఉంటుంది. 

Tags:    

Similar News