ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే తెరిచే గుడి ఇది మాత్రమే..!

సాధారణంగా ప్రతి ఆలయంలో ఏడాది మొత్తం పూజలు జరుగుతాయి.

Update: 2024-08-08 10:36 GMT

దిశ, వెబ్ డెస్క్ : సాధారణంగా ప్రతి ఆలయంలో ఏడాది మొత్తం పూజలు జరుగుతాయి. కొన్నిటిలో కొన్ని నెలలు మాత్రమే పూజలు జరగగా మిగతా రోజులు మూసివేస్తారు. కానీ ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయంలోని నాగచంద్రేశ్వర ఆలయంలో మాత్రం ఏడాదికి ఒక్కరోజు మాత్రమే పూజలు జరుగుతాయి. మిగతా రోజుల్లో ఆలయాన్ని మూసివేస్తారు. ఉజ్జయిని ఆలయంలోని మూడో అంతస్తులో ఉన్న నాగచంద్రేశ్వర స్వామి ఆలయం తలుపులు కేవలం నాగపంచమి రోజున మాత్రమే తెరిచి, స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి భక్తులను దర్శనానికి అనుమతినిస్తారు. నాగపంచమి రోజు కాకుండా మిగతా 364 రోజులూ ఈ ఆలయం మూసి ఉంచుతారు. నాగపంచమి రోజున మాత్రమే సర్పరాజు తక్షకుడు పాతాళం నుండి వచ్చి ప్రజలకు దర్శనం ఇస్తాడాని, మిగతా రోజులు పాతాళంలో కొలువై ఉంటాడని ఇక్కడి స్థల పురాణం. అన్నట్టూ ఈ ఏడాదిలో నాగపంచమి వచ్చే రోజు ఆగస్ట్ 9న. అంటే రేపే అన్నమాట.    


Similar News