Ugadi Panchangam : ఈ రాశివారికి ఏలినాటి శని ఉన్నా అంతా శుభమే!

తెలుగు నూతన సంవత్సరం, ఉగాది పండుగను ప్రజలందరూ ఏప్రిల్ 9న ఘనంగా జరుపుకోనున్నారు. ఏప్రిల్ 8న అమావాస్యతో శోభకృత నామ సంవత్సరం పూర్తి కావడంతో, ఏప్రిల్ 9న మంగళవారం నుంచి క్రోధినామ

Update: 2024-03-23 10:39 GMT

దిశ, ఫీచర్స్ : తెలుగు నూతన సంవత్సరం, ఉగాది పండుగను ప్రజలందరూ ఏప్రిల్ 9న ఘనంగా జరుపుకోనున్నారు. ఏప్రిల్ 8న అమావాస్యతో శోభకృత నామ సంవత్సరం పూర్తి కావడంతో, ఏప్రిల్ 9న మంగళవారం నుంచి క్రోధినామ సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఇక ఈరోజు రాశిఫలాలు చూసుకుంటారు. కొత్త పంచాంగం ప్రకారం ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందని తెలుసుకుంటారు. కాగా, ఈరోజు మనం క్రోధినామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుదాం.

ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5 ఉండబోతుంది.

వృశ్చిక రాశి వారికి చాలా ఏళ్ల తర్వాత శ్రీ క్రోధి నామ సంవత్సరం కలిసి వస్తుంది. డబ్బు, కుటుంబం, గౌరవానికి కారకుడైన గురుడు ఏడో స్థానంలో ఉన్నాడు, రాహు కేతువులు 5,11 స్థానాల్లో సంచరిస్తున్నదున మీరు ఏ రంగంలో ఉన్నా దూసుకెళతారు.దీంతో ఈ సంవత్సరం ఈ రాశిలోని విద్యార్థులకు, వ్యాపారస్తులకు కలిసి వస్తుంది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నవారు, పరీక్షల్లో మంచి విజయం సాధించడం, వ్యాపారస్తులకు మంచి లాభాలు, రియలెస్టేట్ రంగంలో ఉన్నవారికి కలిసి రావడం జరుగుతుంది. అంతే కాకుండా అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి.గడిచిన ఏడాదిలో ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది. మీకు ఏలినాటి శని నడుస్తున్నప్పటకీ ఆ ప్రభావం పెద్దగా ఉండదు. మీకు మంచి ప్రోత్సాహం లభిస్తుంది, ఊహించనంత ఉన్నత స్థానానికి చేరుకుంటారు. మానసిక ధైర్యం, మీ ఆలోచన విధానం మీకు ప్లస్ అవుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. అయితే ఏలినాటి శని ఉండటం వలన వీరికి అవమానాలు, ఇంట్లో గొడవలు జరగడం అనేది కామ్ అవుతోంది. కానీ గురు బలం వలన అవి త్వరగా సర్దుకోవడం లాంటిది జరుగుతుంది. ఇక దీని బట్టి చూస్తే ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి మంచి ఫలితాలనే అందిస్తోందని చెప్పవచ్చ. గురు బలం ఉండటం వలన వీరు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. కానీ ఏలినాటి శని ఉండటం వల్ల అవమానాలు, బాధలు తప్పవు.

Tags:    

Similar News