TTD Good News : మహా కుంభమేళా భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్

ఉత్తరప్రదేశ్(UP)లోని ప్రయాగ్ రాజ్(PrayagRaj)లో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరుగనున్న మహాకుంభ మేళలో(Kumbamela) టీటీడీ(TTD) ఆధ్వర్యంలో శ్రీవారి నమూనా ఆలయం(Srivari Model Temple) ఏర్పాటుకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Update: 2024-12-17 14:10 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్(UP)లోని ప్రయాగ్ రాజ్(PrayagRaj)లో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరుగనున్న మహాకుంభ మేళలో(Kumbamela) టీటీడీ(TTD) ఆధ్వర్యంలో శ్రీవారి నమూనా ఆలయం(Srivari Model Temple) ఏర్పాటుకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం టీటీడీ జేఈవో గౌతమి సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్షలో పలు సూచనలు చేశారు. ఉత్తరాది భక్తులు స్వామివారిని ప్రశాంతంగా దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. 45 రోజుల పాటు సాగే మహాకుంభ మేళకు దాదాపు 2.5 ఎకరాల విస్తీర్ణంలో నమూనా ఆలయం ఏర్పాటు చేస్తున్నామన్నారు. తిరుమల తరహాలో శ్రీవారి కల్యాణోత్సవాలు, చక్రస్నానం(Chakrasnanam) తదితర కైంకర్యాలు జరుపుతామని వెల్లడించారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు, కళాబృందాల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. యూపీ పోలీస్ అధికారులతో టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారులు సమన్వయం చేసుకుని పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు.

Tags:    

Similar News