చైత్రమాసంలో పొరపాటున కూడా ఈ పనులు చేయకండి.. లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావచ్చు..
హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్ర మాసం మార్చి 27 నుంచి ప్రారంభమై ఏప్రిల్ 23న ముగుస్తుంది.
దిశ, ఫీచర్స్ : హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్ర మాసం మార్చి 27 నుంచి ప్రారంభమై ఏప్రిల్ 23న ముగుస్తుంది. శాస్త్రాల ప్రకారం, బ్రహ్మ దేవుడు ఈ మాసంలో విశ్వ సృష్టిని ప్రారంభించాడని పండితులు చెబుతున్నారు. హిందూ మతంలో చైత్ర మాసానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే నవరాత్రి, రామ నవమి, పాపమోచినీ ఏకాదశి, హనుమాన్ జయంతి వంటి అనేక ప్రధాన పండగలు, ఉపవాసాలు ఈ మాసంలో జరుగుతాయి. మత గ్రంధాల ప్రకారం చైత్రమాసంలో కొన్ని పనులు చేయడం నిషిద్ధం అని పండితులు చెబుతున్నారు. ఈ మాసంలో ఈ నిషేధిత పనులు చేయడం వల్ల ప్రజలు జీవితంలో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని నమ్ముతారు. చైత్రమాసంలో ఏయే పనులకు దూరంగా ఉండాలో తెలుసుకుందాం.
చైత్ర మాసంలో ఇంట్లో శ్రేయస్సు, ఆనందం, శాంతి ఉండేలా లక్ష్మీ దేవి, దుర్గాదేవి అనుగ్రహాన్ని పొందడానికి కొన్ని ప్రత్యేక చర్యలు అవలంబిస్తారు. ఈ మాసం మొత్తం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఎందుకంటే ఈ మాసం దుర్గాదేవికి అంకితం చేశారు. చైత్ర నవరాత్రులు కూడా ఈ మాసంలోనే వస్తాయి. నవరాత్రుల కారణంగా చైత్రమాసం మొత్తం భగవతీ దేవిని పూజిస్తారు.
చైత్ర మాసంలో ఈ పనులు చేయవద్దు..
తామసిక, మాంసాహారం : చైత్రమాసంలో పొరపాటున కూడా తామసిక లేదా మాంసాహారం తీసుకోకూడదు. చైత్రమాసంలో ఈ ఆహారాన్ని తినడం వల్ల సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుందని, దీనివల్ల వ్యక్తి జీవితంలో ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతారు.
బెల్లం వినియోగం : ఈ మాసంలో బెల్లం తినకూడదట. బెల్లం ప్రకృతిలో వేడిగా ఉంటుంది కాబట్టి వేసవిలో బెల్లం తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం.
జుట్టు, గోర్లు కత్తిరించడం : చైత్ర మాసంలో జుట్టు కత్తిరించడం నిషేధించారు. ఈ మాసంలో జుట్టు కత్తిరించడం వల్ల ఇంటి ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుందని, గృహ సమస్యలకు దారితీస్తుందని నమ్ముతారు. అలాగే ఈ నెలలో గోర్లు కత్తిరించకుండా ప్రయత్నించండి. ఒకవేళ ఖచ్చితంగా గోర్లు కత్తిరించాలనుకుంటే గురువారం రాత్రి మాత్రం అస్సలు గోర్లు కత్తిరించవద్దు.
పోట్లాడుకోకూడదు : జ్యోతిష్యం ప్రకారం చైత్రమాసంలో ఇంట్లో గొడవలు ఉండకూడదు. భార్యాభర్తలు ఎలాంటి వివాదాలకు, వాదనలకు దూరంగా ఉండాలి. ఇంటి స్త్రీ లక్ష్మీ స్వరూపమని నమ్ముతారు. అందుకే ఈ మాసంలో పొరపాటున కూడా గొడవలు పెట్టుకోకూడదు.
కొత్త పని చేయవచ్చు : వేదాలు, పురాణాల ప్రకారం, చైత్ర మాసం మొదటి రోజు చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. అందుకే ఈ రోజు ఏదైనా కొత్త పని చేయడానికి కూడా మంచిదని భావిస్తారు.