శ్రీరామనవమి రోజు అస్సలు చేయకూడని పనులు ఇవే..
భారతీయులు అత్యంత ఇష్టంగా, ఘనంగా జరుపుకునే పండుగలలో శ్రీరామనవమి ఒకటి.
దిశ, వెబ్‌డెస్క్: భారతీయులు అత్యంత ఇష్టంగా, ఘనంగా జరుపుకునే పండుగలలో శ్రీరామనవమి ఒకటి. పుష్య నక్షత్రంలో చైత్రమాసం శుక్లపక్షం తొమ్మిదో రోజున శ్రీరాముడు జన్మించారు. శ్రీరాముడు పుట్టిన రోజు సందర్భంగా.. స్వామివారికి ప్రత్యేకంగా పూజలు చేయడంతో పాటు కళ్యాణం కూడా జరిపిస్తారు. ప్రతి గ్రామంలో ఈ ఆచారం కొనసాగుతుంది. నవమి రోజు ప్రజలు అందరూ ఒక దగ్గర చేరి రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని ఎంతో భక్తితో జరిపిస్తారు. అనంతరం ఆరోజు రాత్రి శ్రీరాములవారిని, సీతమ్మ తల్లిని పల్లకిలో ఊరంతా ఊరేగిస్తారు. ఇక చాలామంది శ్రీరామనవమి రోజు ఉపవాసం కూడా చేస్తారు. నదులలో స్నానాలు చేస్తారు. ఇలా కొన్ని ఆచారాలు ఎంతో మేలు చేసి పాపాలను తొలగిస్తాయి. అయితే శ్రీరామనవమి రోజు చేయకూడని పనులు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..
శ్రీరామనవమి రోజు చేయకూడని పనులు..
*మాంసాహారం తినకూడదు.
*మద్యం సేవించకూడదు.
*ఉపవాసం ఉన్న లేకున్నా కూరల్లో ఉల్లిపాయలు, వెల్లుల్లి అస్సలు వేయకూడదు.
*షేవింగ్ చేసుకోవడం, జుట్టు కత్తిరించడం లాంటివి చేయరాదు.
*ఇతరులతో మంచిగా ఉండాలి. ముఖ్యంగా ఎదుటి వారికి ద్రోహం చేయకూడదు.