వినాయకుడి నిమజ్జనానికి భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే.. పురోహితులు ఏం చెబుతున్నారంటే?

వినాయక చవితిరోజు నుంచి గణనాథుడి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా ఓ రేంజ్‌లో నిర్వహించుతున్నారు.

Update: 2024-09-12 11:08 GMT

దిశ, వెబ్‌డెస్క్: వినాయక చవితిరోజు నుంచి గణనాథుడి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా ఓ రేంజ్‌లో నిర్వహించుతున్నారు. అంతేకాదు ఎక్కడ చూసినా అందంగా అలంకరించిన వినాయక మండపాలు, పాటలతో వీధి వీధిలో సందడి నెలకొంది. ఇక వినాయకుడి నిమజ్జనాలు కూడా ప్రారంభం అయ్యాయి. ప్రాంతాలను బట్టి వినాయక నిమజ్జనం చవితి తర్వాత మూడో రోజు లేదా ఐదో రోజు నిర్వహిస్తుంటారు. కొన్ని ప్రాంతాల్లో తొమ్మిదో రోజు లేదా పదకొండో రోజు కూడా ఉంటుంది.

అయితే ఎప్పుడు నిమజ్జనం చేసిన పండుగ వాతావరణం నెలకొంటుంది. ఇన్ని రోజులు ఘనంగా పూజలు అందుకున్న గణపయ్య గంగమ్మ ఒడిలో చేరుతున్నారు. ఈ క్రమంలో యువతీ యువకులు అంగరంగా వైభవంగా, ఉత్సాహంగా డాన్స్ చేస్తూ మనసారా వీడ్కోలు చెబుతారు. గణేష్ నిమజ్జనం సమయంలో భక్తులు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలని పురోహితులు చెబుతున్నారు. అవి ఏంటంటే..

*వినాయక నిమజ్జనం కోసం సమీపంలో ఉండే నీటి సదుపాయాలు ముందుగా గుర్తించాలి. ఈ క్రమంలో నిమజ్జనానికి ఎంపిక చేసుకున్న నది, లేదా కుంట, చెరువు వంటివి సురక్షితమా కాదా అనేది నిర్ణయించుకోవాలి. అవి భక్తులకు అందుబాటులో ఉండాలి. కావున వినాయకుడి విగ్రహాలు కలుషితమైన నీటిలో నిమజ్జనం చేయకూడదు.

*వినాయక నిమజ్జనానికి సమయం కూడా చాలా ముఖ్యం అంటున్నారు. శుభప్రదమైన సమయంలో నిమజ్జనం చేయాలి. చంద్ర చక్రం, జ్యోతిష్య ప్రభావాలను పరిగణనలోకి తీసుకుని అనుకూలమైన సమయాన్ని ఎంచుకోవాలి. అయితే సాధారణంగా వినాయక నిమజ్జనానికి ఉదయం లేదా సాయంత్రం సమయం అనుకూలమైనదిగా పరిగణిస్తారు. సూర్యాస్తమయంలోపు నిమజ్జనాన్ని పూర్తి చేయడం మంచిది. ఎందుకంటే చీకటి పడే కొద్దీ ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉండవచ్చు.

*నిమజ్జనానికి ముందు గణేషుడి విగ్రహాలకు పూజ చేయాలి. పుష్పాలు, పూలమాలలతో అలంకరించాలి. తీపి పదార్థాలతో నైవేద్యాన్ని సమర్పించాలి. చందనం, సింధూరంతో గణనాథులకు తిలకం దిద్దాలి. వీటి కారణంగా విగ్రహాల శక్తి చెక్కుచెదరకుండా ఉంటుంది, విఘ్నేశ్వరుని ప్రతిమలు ఆకర్షణీయంగా కనిపిస్తాయి.

*విగ్రహం నీటిలో పూర్తిగా మునిగేలా క్రేన్ సహాయంతో కిందకు నెమ్మదిగా దించాలి.

*ఈ క్రమంలో పొరపాటున ఏం అయినా తప్పులు జరిగి ఉంటే క్షమించమని వినాయకుని వేడుకోవాలి.

నోట్: ఈ సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.


Similar News