Sharad Purnima: శరద్ పూర్ణిమ.. ఆ రోజున ఈ పనులు అసలు చేయకండి..?

శరద్ పూర్ణిమ.. ఆ రోజున ఈ పనులు అసలు చేయకండి

Update: 2024-09-23 06:32 GMT

దిశ, వెబ్ డెస్క్ : ప్రతి ఏడాది శరద్ పూర్ణిమ వస్తుంది. ఆ తర్వాత అశ్విని మాసం శుక్లపక్ష చతుర్దశి తిధి మరుసటి రోజున వస్తుంది. ఆ రోజున లక్ష్మీదేవి, విష్ణువును పూజిస్తారు. ముఖ్యంగా, ఈ రోజున విష్ణువును పూజించడం వల్ల జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోతాయని చెబుతుంటారు. మరి, ఈ ఏడాది శరద్ పూర్ణిమ ఎప్పుడు వచ్చిందో ఇక్కడ తెలుసుకుందాం..

అశ్విని మాసం పౌర్ణమి తేదీ అక్టోబర్ 16 వ తేదీన రాత్రి 8:40 గంటలకు నుంచి మొదలయి అక్టోబర్ 17వ తేదీ 4:55 గంటల వరకు ఉంటుంది. ఈ ఏడాది శరద్ పూర్ణిమ పండుగ అక్టోబర్ 16 న జరుపుకోనున్నారు. అయితే, ఈ శరద్ పూర్ణిమ రోజు తెలిసి తెలియక తప్పులు చేయకండని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

ఈ రోజు డ్రింక్ , స్మోక్ , నాన్ వెజ్ వంటి వాటికీ దూరంగా ఉండాలి. అలాగే ఆహారంలో ఉల్లి , వెల్లుల్లి లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా, ఇలాంటివి లక్ష్మీదేవికి అసలు నచ్చవు. ఒక వేళా ఇలా చేస్తే ఆర్ధిక సమస్యలు ఎక్కువవుతాయి. అలాగే, ఇంట్లో గొడవలు రాకుండా ఇంటి సభ్యులు మొత్తం లక్ష్మీదేవికి పూజ చేయాలట. అలాగే, ఈ రోజున నలుపు రంగు దుస్తులు అసలు ధరించకూడదని పండితులు అంటున్నారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Tags:    

Similar News