ఆ గుహలో అంతుచిక్కని రహస్యాలు.. ఒక్కసారి లోపలికి వెళితే తిరిగి రావడం చాలా కష్టం..
భారతదేశంలోని ఎన్నో శివాలయాల్లో కైలాసనాధుడు కొలువై ఉన్నాడు.
దిశ, ఫీచర్స్ : భారతదేశంలోని ఎన్నో శివాలయాల్లో కైలాసనాధుడు కొలువై ఉన్నాడు. అంతే కాదు అనేక గుహల్లోనూ దర్శనం ఇస్తూ ఉంటాడు. అయితే ఈ గుహల్లో ఎవ్వరికీ అంతుచిక్కని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఎంతో మంది ఈ రహస్యాలను ఛేదించాలని చూసినా సాధ్యపడకపోవడంతో వదిలేస్తున్నారు. పౌరాణిక చరిత్ర, ప్రకృతి సౌందర్యాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు శివునికి సంబంధించిన 5 రహస్య గుహల గురించి తెలుసుకుందాం.
పాతాళ భువనేశ్వర్ గుహ..
పాతాళ భువనేశ్వర్ గుహ భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పితోరాఘర్ జిల్లా గంగోలిహట్ నుండి 14 కి.మీ దూరంలో ఉన్న సున్నపురాయి హిందూ గుహ. ఇది భువనేశ్వర్ గ్రామంలో ఉంది. ఈ గుహలో శివుడు, ముప్పై మూడు కోట్లమంది దేవతలు ఉన్నారని పురాణాలు చెబుతున్నాయి. గుహ 160 మీటర్ల పొడవు, ప్రవేశ ద్వారం నుండి 90 అడుగుల లోతులో ఉంది. ఈ గుహలోపలి సొరంగ మార్గం అనేక గుహలకు దారితీస్తుంది.
ఈ గుహను కనుగొన్న మొదటి మానవుడు త్రేతా యుగంలో అయోధ్యను పరిపాలిస్తున్న సూర్య వంశం రాజు అయిన రాజా ఋతుపూర్ణుడు. ఒకసారి నలుడు అతని భార్య రాణి దమయంతి చేతిలో ఓడిపోయాడని పురాణాలు చెబు చెబుతారు. అప్పుడు నలుడు తనను దాచమని ఋతుపూర్ణను అభ్యర్థించాడట. ఋతుపూర్ణ అతన్ని హిమాలయాల అడవులకు తీసుకెళ్లి అక్కడ ఉండమని తెలిపారు. ఇంటికి తిరిగి వెళుతున్నప్పుడు అతను అడవిలోకి పరిగెత్తిన జింకను చూసి ఆకర్షితుడయ్యాడు. అది దొరక్క చెట్టుకింద విశ్రాంతి తీసుకున్నాడు. జింకను వెంబడిస్తూ వెళ్లి ఒక గుహను చూశాడు. ఆ గుహ గురించి ఆరా తీసిన తర్వాత లోపలికి వెళ్లారు. అక్కడ ప్రవేశ ద్వారం వద్ద రీతుపూర్ణ శేషనాగ్‌ని కలుసుకుని గుహలోపలికి వెళ్లాడు. అక్కడ అతను 33 వేలకోట్ల మంది దేవతలను అలాగే స్వయంగా శివుడినిక కూడా చూశాడట. ఆయన దర్శనం తరువాత ఈ గుహను యుగాల పాటు మూసివేశారట. కలియుగంలో ఆదిశంకరాచార్య హిమాలయాలను సందర్శించినప్పుడు ఈ గుహను తిరిగి కనుగొన్నారు. అప్పటి నుండి ఈ ప్రదేశంలో నిత్య పూజలతో కలకలలాడుతుంది.
ఆలయం వెలుపల శాసనం..
ఈ అద్భుతమైన గుహ భూమి అంత పురాతనమైనది శాసనాలు చెబుతున్నాయి. ఇది "స్కంద పురాణం"లోని మనస్ఖండంలోని 103 అధ్యాయంలో వివరంగా ప్రస్తావించారు. ఈ గుహలో ప్రవేశించిన మొదటి మానవుడు సూర్య వంశానికి చెందిన రాజు "ఋతుపర్ణ". త్రేతాయుగంలో అతని సందర్శన సమయంలో అనేక మంది రాక్షసులను ఎదుర్కొన్నాడని, "శేషనాగు" తనకు మార్గదర్శిగా వ్యవహరించాడని చెబుతారు.
అలాగే పురాణాల ప్రకారం శివుడు తన త్రిశూలంతో వినాయకుడి తలను తెంచిన విషయం అందరికీ తెలిసిందే. కోపోదృక్తుడూ తెంచిన వినాయకుని తలను ఈ రహస్య గుహలో చూడవచ్చంటున్నారు.
శివ ఖోడి గుహ రహస్యం..
జమ్మూలోని రాయసి జిల్లాలో ఉన్న శివఖోడి గుహ 150 మీటర్ల పొడవు ఉంది. పార్వతి, గణేశుడు, కార్తికేయతో పాటు శివుడు తన కుటుంబంతో సహా ఇక్కడ ఉన్నాడని అక్కడి ప్రజలు చెబుతుంటారు. ఈ గుహ మరొక చివర అమర్‌నాథ్ గుహ ఉందని చెబుతారు. పురాణాల ప్రకారం భస్మాసురున్ని శివుడు ఇక్కడే నాశనం చేశారట. ఈ గుహలో శివుడిని చూసిన తర్వాత ఎవరు ముందుకు వెళితే వారు తిరిగి రాలేరని అక్కడి ప్రజలు చెబుతుంటారు.
అమర్‌నాథ్ గుహ రహస్యం..
అమర్‌నాథ్ గుహ శివుని అత్యంత రహస్యమైన గుహలలో ఒకటి. ఇక్కడ శివుడు మంచు రూపంలో ఉంటాడు. ఇక్కడ ప్రతి సంవత్సరం మంచు నుండి శివలింగ ఆకారం ఏర్పడుతుంది. ఈ గుహలోనే పరమశివుడు పార్వతీమాతకు అమరుడయ్యే వృత్తాంతాన్ని చెప్పాడని ప్రతీతి. ఈ గుహలో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇక్కడ నిర్మించిన శివలింగం ఘన మంచుతో తయారు చేశారు. అయితే కింద విస్తరించిన మంచు చాలా మృదువుగా ఉంటుందట.
దుర్వాస ఋషి గుహ రహస్యం..
మధ్యప్రదేశ్‌లోని అనుప్పూర్ జిల్లాలో త్రిపుర అనే రాక్షసుడిని శివుడు సంహరించిన సందర్భం అమర్‌కంటక్. ఇక్కడ దుర్వాస గుహ అని పిలిచే ఓ గుహ ఉంది. ఇక్కడ దుర్వాస మహర్షి విగ్రహంతో పాటు ఆయన ఆరాధ్య దైవమైన మహాదేవుని శివలింగం కూడా ఉంది. ఇక్కడ విశేషమేమిటంటే నీరు చుక్కలుగా ప్రవహిస్తూనే ఉంటుంది. నర్మదా నది శివుడిని ప్రతిష్ఠిస్తుందని నమ్ముతారు.
తులార్ గుహ రహస్యం..
ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో ఎంతో చారిత్రాత్మకమైన శివుని గుహ ఉంది. మూడు జిల్లాల సరిహద్దులో అబుజ్మద్‌లో ఉన్న తులార్ గుహ వీటిలో ఒకటి. ఏళ్ల నాటి శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్టించారని చెబుతారు. ఇక్కడ ప్రకృతి శివునికి ఏడాది పొడవునా అభిషేకం చేస్తూనే ఉంటుంది. ఇక్కడ రాళ్ల నుంచి నీరు పడుతూనే ఉంటుంది. ఇక్కడికి చేరుకోవడం చాలా కష్టం. మహాశివరాత్రి నాడు శివుని దర్శనానికి వేలాది మంది భక్తులు వస్తుంటారు.