నవరాత్రులు ప్రారంభంలో ఈ పనులు చేయండి.. అన్నీ శుభాలే కలుగుతాయి..
శారదీయ నవరాత్రి సనాతన ధర్మం ప్రధాన పండుగలలో ఒకటి.
దిశ, వెబ్‌డెస్క్ : శారదీయ నవరాత్రి సనాతన ధర్మం ప్రధాన పండుగలలో ఒకటి. ఈ నవరాత్రులు పితృపక్షం ముగిసిన మరుసటి రోజు నుండి, సర్వ పితృ అమావాస్య అంటే అశ్వీయుజ అమావాస్య ముగిసిన తర్వాత ప్రారంభమవుతుంది. ఈ సారి శారదీయ నవరాత్రులు అక్టోబర్ 3వ తేదీ శనివారం ప్రారంభమై అక్టోబర్ 12వ తేదీ వరకు జరుపుకోనున్నారు. అశ్వియుజ శుక్ల ప్రతిపద తిథి శారదీయ నవరాత్రుల మొదటి రోజు. ఈ రోజుల్లో ప్రజలు దుర్గామాతను ప్రసన్నం చేసుకోవడానికి ఉపవాసం, పూజలతో సహా వివిధ కార్యక్రమాలు చేస్తారు. అంతే కాదు నవరాత్రుల ప్రారంభానికి ముందు మాతారాణిని పూజించేందుకు ఇంట్లో కొన్ని మొక్కలు నాటవచ్చు. ఇంతకీ అమ్మవారి ఆశీస్సులు పొందాలంటే ఎలాంటి ఏయే మొక్కలు నాటాలో ఇప్పుడు తెలుసుకుందాం.
నవరాత్రులలో మొదటి రోజున ఈ మొక్కలను నాటడం ద్వారా అమ్మవారు ప్రసన్నులవుతారు..
తులసి : పండితులు తెలిపిన వివరాల ప్రకారం హిందూ మతంలో తులసి లేని ఇంటి ప్రాంగణం అసంపూర్ణంగా కనిపిస్తుంది. మీ ఇంట్లో ఇంకా తులసి మొక్క లేకపోతే నవరాత్రికి ముందు నాటాలి. ఇలా చేయడం వల్ల దుర్గామాత సంతోషిస్తుందని తెలిపారు. అలాగే భక్తుల కోరికలు కూడా నెరవేరుతాయి.
హర్సింగార్ : హర్సింగార్ మొక్క చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. అందుకే నవరాత్రుల ప్రారంభంలో ఈ మొక్కను నాటితే ఆ ఇంట్లో సుఖసంతోషాలు ఉంటాయి. అంతే కాదు నవరాత్రులలో మాతారాణికి హర్సింగార్ పువ్వులు, దండలు కూడా సమర్పించవచ్చు.
శంఖపుష్పి : శంఖపుష్పి మొక్క నుండి వెలువడే శక్తి ఇంటి నుండి ప్రతికూలతను తొలగిస్తుంది. అలాగే నవరాత్రి పూజ సమయంలో దుర్గా దేవి పాదాల వద్ద ఈ తెలుపు, ఊదా రంగుల పుష్పాలను సమర్పించండి. మీరు దీన్ని నవరాత్రి సమయంలో కూడా అమ్మవారికి సమర్పించాలి.
అరటి : నవరాత్రులలో మీరు అరటి మొక్కను నాటి పూజించవచ్చు. ఇలా చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇంట్లో దీన్ని పెట్టడం వలన ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. ఈ మొక్క శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రమైనందున మాతా రాణికి కూడా చాలా ఇష్టమని చెబుతారు.