Pathala Lokam: పాతాళలోకం నిజంగా ఉందా? దీని గురించి పురాణాలు ఏమి చెబుతున్నాయంటే?
చాలా మందికి వచ్చే సందేహం పాతాళలోకం నిజంగా ఉందా ?
దిశ, వెబ్ డెస్క్ : చాలా మందికి వచ్చే సందేహం పాతాళలోకం నిజంగా ఉందా ?లేదా అంటూ కొన్ని సందర్భాలలో సందేహాలు వస్తుంటాయి. అయితే మనుషులు భూలోకంలో నివసిస్తే.. ఆకాశలోకంలో స్వర్గం ఉంటుంది.. అక్కడ దేవతలు ఉంటారని చెబుతుంటారు. ఇంకా భూమి క్రింద భాగంలో పాతాళ లోకం ఉంటుందని అంటుంటారు. పాతాళలోకం నిజంగా ఉందా? ఒక వేళ ఉంటే ఎక్కడ ఉంది? పాతాళ లోకం వెనుక దాగి ఉన్న రహస్యం ఏంటి ?
పురాణాలు ప్రకారం మొత్తం మూడు లోకాలు ఉన్నాయి. అవే స్వర్గ లోకం, భూలోకం , పాతాళలోకం. రాక్షషులు పాతాళాన్ని పరిపాలిస్తుంటారు. నాగ జాతికి చెందిన వారు ఇక్కడ నివసిస్తుంటారు. సూర్య సిద్ధాంతం ప్రకారం చూసుకుంటే భూమి దక్షిణార్ధ గోళంలో పాతాళం ఉంటుంది.పాతాళ లోకం భూమికి దిగువన ఉన్న గ్రహ వ్యవస్థల్లో ఉందని భాగవత పురాణం చెబుతుంది. పాతాళలోకం సూర్య రశ్మి ఉండదు.. అంతా చీకటిగా మిల మిల మెరుస్తున్న ఆభరణాలు వెలుగుతూ ఉంటాయట.
Read more: