భారతదేశంలోనే కాదు ఆ దేశాల్లో కూడా మకర సంక్రాంతిని జరుపుకుంటారు..

ఈ సంవత్సరం ఉత్తరాయణ పండుగ అంటే జనవరి 15న మకర సంక్రాంతిని జరుపుకుంటారు.

Update: 2024-01-14 09:49 GMT

దిశ, ఫీచర్స్ : ఈ సంవత్సరం ఉత్తరాయణ పండుగ అంటే జనవరి 15న మకర సంక్రాంతిని జరుపుకుంటారు. ఈ రోజున సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. భారతదేశమంతటా ఈ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. అయితే, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో జరుపుకుంటారు. మకర సంక్రాంతికి నదీస్నానం, దానధర్మాలకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చి గంగానదిలో స్నానాలు చేస్తుంటారు. ఈ ఉత్తరాయణ పండుగ భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా జరుపుకుంటారు. మకర సంక్రాంతి పండుగను ఏయే దేశాల్లో జరుపుకుంటారో తెలుసుకుందాం.

శ్రీలంక

శ్రీలంక భారతదేశానికి దక్షిణాన ఉంది. ఇక్కడ కూడా మకర సంక్రాంతిని జరుపుకుంటారు. ఈ దేశంలో సంక్రాంతిని విభిన్న సంప్రదాయంతో జరుపుకుంటారు. ఇక్కడ సంక్రాంతిని ఉజాహవర్ తిరనాల్ అంటారు. మరికొందరు దీనిని పొంగల్ అని కూడా అంటారు. దీనికి కారణం ఇక్కడ తమిళనాడుకు చెందిన వారు అధిక సంఖ్యలో నివసించడమే.

మయన్మార్

మయన్మార్‌లో ఈ పండుగను చాలా ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఇక్కడ ఈ పండగను తినాగ్యాన్ పేరుతో పిలుస్తారు. మయన్మార్‌లోని మకర సంక్రాంతి పండుగ బౌద్ధ సమాజంతో ముడిపడి ఉంది. ఈ పండుగ 3 నుండి 4 రోజుల పాటు జరుపుకుంటారు. నూతన సంవత్సర ఆగమనాన్ని పురస్కరించుకుని ఇక్కడ మకర సంక్రాంతిని జరుపుకుంటారని చెబుతారు.

థాయిలాండ్

మకర సంక్రాంతి పండుగను థాయ్‌లాండ్‌లో కూడా జరుపుకుంటారు. థాయ్‌లాండ్‌లో సాంగ్‌కార్న్ పండగ అని పిలుస్తారు. పురాతన కాలంలో, థాయ్‌లాండ్‌లోని ప్రతి రాజుకు తన స్వంత ప్రత్యేక గాలిపటం ఉండేది. దేశ ప్రజల ఆశీస్సును ఆకాంక్షిస్తూ పండితులు, పూజారులు ఈ గాలిపటాన్ని చలిలో ఎగురవేసేవారు. థాయ్‌లాండ్ రాజులు మాత్రమే కాకుండా ప్రజలు కూడా తమ ప్రార్థనలను దేవునికి తెలియజేయడానికి గాలిపటాలు ఎగురవేసేవారని చెబుతారు.

Tags:    

Similar News