తిరుపతిలో వైభవంగా పవిత్రోత్సవాలు.. నేటి ప్రత్యేకతలివే!
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మూడు రోజుల నుంచి నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలు బుధవారం సాయంత్రం పూర్ణాహుతితో ఘనంగా ముగిసాయి.
దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మూడు రోజుల నుంచి నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలు బుధవారం సాయంత్రం పూర్ణాహుతితో ఘనంగా ముగిసాయి. ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేసి వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. గురువారం నాడు అనంత పద్మనాభ వ్రతం ఘనంగా జరిగింది.
ఇందులో భాగంగా ఉదయం శ్రీవారి సుదర్శన చక్రత్తాళ్వారును ఆలయం నుంచి ఊరేగింపుగా శ్రీ భూవరాహ స్వామి ఆలయం వద్దనున్న స్వామివారి పుష్కరిణి చెంతకు వేంచేపు చేశారు. అక్కడ చక్రత్తాళ్వార్లకు అభిషేకాదులు నిర్వహించిన అనంతరం శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. అయితే నిన్న 66, 336 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 25, 857 వేల మంది తలనీలాలు సమర్పించారు. హుండీలో 2. 24 కోట్ల కానుకలు వచ్చాయి.