మీరు కలలో ఈ రంగు కుక్కను చూశారా.. దేనికి సంకేతమో తెలుసా..
తరచుగా మనం కలలో చాలా రకాల వస్తువులను, జంతువులను చూస్తాము.
దిశ, ఫీచర్స్ : తరచుగా మనం కలలో చాలా రకాల వస్తువులను, జంతువులను చూస్తాము. ఈ విషయాలు కొన్నిసార్లు శుభ సంకేతాలను, కొన్నిసార్లు అశుభ సంకేతాలను ఇస్తాయి. ఈ కలలో కనిపించే అన్ని విషయాలు మన జీవితంలో చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే అవి వ్యక్తి భవిష్యత్తులో జరిగే సంఘటనలను సూచిస్తాయి. స్వప్న శాస్త్రంలో ప్రతి కలలో ఖచ్చితంగా ఏదో ఒక అర్థం ఉంటుంది.
కలలు గతం, భవిష్యత్తు గురించి సూచనలను ఇస్తాయి. చాలా సార్లు, నిద్రపోయే ముందు మనం ఏమనుకుంటున్నామో అది మన మనస్సులో ఉంటుంది. మనం ఎక్కువగా దాని గురించి మాత్రమే కలలు కంటాము. కొందరికి కలలో జంతువులు, పక్షులు కూడా కనిపిస్తాయి. అయితే మీ కలలో కొన్ని సార్లు కుక్క కాటు వేసినట్టు, కుక్క ఏడుపు లేదా మరేదైనా ఇతర పరిస్థితుల్లో కనిపిస్తూ ఉంటాయి. మరి ఎలాంటి పరిస్థితిలో కుక్కలు కలలో కనిపిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో, స్వప్న శాస్త్రం ఏం చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
కలలో నల్ల కుక్క..
స్వప్న శాస్త్రం ప్రకారం, నల్ల కుక్క జాతకంలో అత్యంత శక్తివంతమైన శనిగ్రహానికి సంబంధించినదిగా పరిగణిస్తారు. నల్ల కుక్కను భైరవుని సేవకుడిగా భావిస్తారు. మీకు కలలో నల్లకుక్క కనిపిస్తే, శనిదేవునితో పాటు, కాలభైరవుడు కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడని అర్థం. మీ కలలో నల్లకుక్కను చూడటం మీకు త్వరలో కొన్ని శుభవార్తలను అందుతుందని, స్నేహితుడిని కూడా కలుస్తుందని సూచిస్తుంది. మీరు కలలో సంతోషంగా ఉన్న నల్ల కుక్కను చూస్తే, అది శుభసూచకమే, కానీ మీ కలలో కోపంగా ఉన్న నల్ల కుక్కను చూడటం అశుభ సంకేతం.
కలలో గోధుమ రంగు కుక్క
కలలో గోధుమ రంగు కుక్క కనిపిస్తే అది మీకు మేలు చేస్తుంది. కలలో గోధుమ రంగు కుక్కను చూడటం శుభసంకేతం. మీ కలలో గోధుమ రంగు కుక్కను చూడటం అంటే మీ సంబంధం మరింత బలపడుతుందని, మీరు ఎవరితోనైనా స్నేహం చేస్తే, ఆ స్నేహం పై నమ్మకం పెరుగుతుంది.
విద్యార్థి కలలో గోధుమ రంగు కుక్కను చూస్తే, మీరు చదువులో విజయం సాధిస్తారని, మీరు చదువులో మంచి ఫలితాలు వస్తాయని అర్థం. డ్రీమ్ సైన్స్ ప్రకారం, అనారోగ్యంతో ఉన్న వ్యక్తి తన కలలో గోధుమ రంగు కుక్కను చూస్తే, అతని ఆరోగ్యం త్వరలో మెరుగుపడుతుందని అర్థం.