భారతదేశంలోని అత్యంత రహస్యమైన దేవాలయాల గురించి తెలుసా

ప్రపంచంలోని అత్యంత రహస్యమైన దేవాలయాలు మన దేశంలో ఉన్నాయి

Update: 2024-07-15 06:57 GMT

దిశ,ఫీచర్స్: ప్రపంచంలోని అత్యంత రహస్యమైన దేవాలయాలు మన దేశంలో ఉన్నాయి. భారత దేశం దైవ శక్తికీ, ఆధ్యాత్మికతకి పుట్టినిల్లు. శక్తీ పీఠాలు, జ్యోతిర్ లింగాలు, వైష్ణవ క్షేత్రాలు కూడా ఉన్నాయి. నిపుణులు కూడా అంతుచిక్కని విశేషమైన మహిమలు కలిగిన ఆలయాలు గురించి ఇక్కడ తెలుసుకుందాం..

కైలాస దేవాలయం

అతిపెద్ద హిందూ దేవాలయాల్లో కైలాస దేవాలయం కూడా ఒకటి. ఇది 16వ శతాబ్దానికి చెందినది. మన పురాణాల గురించి మీ జ్ఞానాన్ని విస్తరించుకునే అవకాశాన్ని ఇస్తుంది. ఈ ఆలయం నిర్మాణం ఏకశిలాగా ఉంటుంది, అంటే ఓకే రాయిపై దీనిని నిర్మించారు. నమ్మశక్యంగా లేదు కదా.. కానీ ఇదే నిజం. గుడి లోపల రామాయాణినికి సంబంధించిన చిత్రాలు చెక్కబడి ఉన్నాయి. ఆలయం యొక్క మూడు అంతస్తుల నిర్మాణంలో కొన్ని శిల్పాలు ఉన్నాయి. మొఘల్ రాజు ఔరంగజేబుకు ఇవి నచ్చకపోవడంతో వాటిని పడగొట్టాలని ఆదేశించాడు, కానీ కైలాస గుహలకు ఏమీ జరగలేదు. ఈ గుడిని మన దేశంలో రహస్యమైన దేవాలయంగా చెబుతుంటారు.

కాల భైరవ నాథ్ ఆలయం

మన దేశంలో కాల భైరవ నాథ్ ఆలయం రహస్యంగా ఉంది. ఇప్పటి వరకు దేవుడికి నైవేద్యంగా పొంగల్, పండ్లు పెట్టె వాళ్ళని చూసాం.. కానీ, ఇక్కడ మొత్తం వింత ఆచారాలను పాటిస్తుంటారు. వారణాసిలోని కాల భైరవ నాథ్ గుడిలోని స్వామి వారికీ వైన్, విస్కీ దేవుడికి ప్రసాదంగా పెడుతుంటారు. గుడి లోపల కూడా మద్యం స్టాల్స్ ఎన్నో ఉంటాయి. భక్తులు గుడిలోకి అడుగు పెట్టె ముందు వాటిని కొనుగోలు చేసి తీసుకుని వెళ్తారు. ప్రతి దేవాలయంలో లాగా ఇక్కడ పూల దండలు ఏమి కనిపించవు.

స్తంభేశ్వర్ మహాదేవ్ ఆలయం

ప్రకృతిని ఆశ్చర్యపరిచే ఈ స్తంభేశ్వర్ మహాదేవ్ ఆలయం రహస్యంగా ఉంది. ఇక్కడ ఆధ్యాత్మిక భక్తిని మీరు చూడవచ్చు. ఈ ఆలయం పెద్ద అలలు వచ్చినప్పుడు ఈ ఆలయం పూర్తిగా మునిగిపోతుంది. తక్కువ అలల సమయంలో మాత్రమే కనిపిస్తుంది. మీరు రహస్య స్తంబేశ్వర్ మహాదేవ్ ఆలయం నుండి కూడా ఆశీర్వాదాలు పొందాలనుకుంటే.. గుజరాత్ వెళ్తే సరిపోతుంది. గుజరాత్‌లోని ఏ నగరం నుండి అయినా సులభంగా అక్కడికి వెళ్లొచ్చు. ఈ ప్రసిద్ధ హిందూ దేవాలయాన్ని సందర్శించండి. అలల మధ్య దేవుని ఉనికిని అనుభూతి చెందండి.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.


Similar News