గుడిలో గంటను మూడు సార్లు మ్రోగించడం వెనక ఉన్న అంతర్యం ఇదే?
హిందూ సాంప్రదాయం ప్రకారం గుడికి వెళ్ళినప్పుడు ప్రాంగణంలో ఉన్న గంటను ఒకసారి లేదా మూడుసార్లు కొడుతారు.
దిశ, వెబ్ డెస్క్: హిందూ సాంప్రదాయం ప్రకారం గుడికి వెళ్ళినప్పుడు ప్రాంగణంలో ఉన్న గంటను ఒకసారి లేదా మూడుసార్లు కొడుతారు. అసలు గంట కొట్టడానికి కారణం మన మనసులో ఉన్న ఆందోళన తగ్గి ప్రశాంతంగా ఉండాలని కోడతారట. దేవుడికి ప్రసాదాలు పెట్టి పూజించడం వల్ల మంచి జరుగుతుందని ప్రజలు నమ్ముతారు. అయితే పూజల విషయంలో అన్నిటి వెనుక కొన్ని ఆంతర్యాలు దాగి ఉంటాయి. అలాగే గంటను కొడితే ఏం జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం.
*ఒక్కసారి గంట కొట్టడం వల్ల మరణానికి సంకేతమని పురాణాలు చెబుతున్నాయి.
*ఒకవేల దేవుడి ముందు రెండు సార్లు గంటను మ్రోగిస్తే పలు రకాల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయట.
*మూడు సార్లు గంట కొట్టడం వల్ల సుఖశాంతులతో పాటు మంచి ఫలితాలు లభిస్తాయని పండితులు సూచిస్తున్నారు. కాబట్టి ఆలయానికి వెళ్లినప్పుడు మూడు సార్లు గంట మ్రోగించడం మంచిది.