దుర్గాదేవి సింహాన్ని తన వాహనంగా ఎలా మార్చుకుంది.. పురాణ కథ ఏంటో చూద్దామా..

శనివారం నవరాత్రి ఉత్సవాలు మూడవ రోజుకు చేరుకున్నాయి. ఈ రోజున చంద్రఘంట తల్లిని పూజిస్తారు.

Update: 2024-10-05 14:28 GMT

దిశ, వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డెస్క్ : శనివారం నవరాత్రి ఉత్సవాలు మూడవ రోజుకు చేరుకున్నాయి. ఈ రోజున చంద్రఘంట తల్లిని పూజిస్తారు. 9 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భక్తుల్లో ఉత్సాహం నెలకొంది. ముగ్గురమ్మల మూలపుటమ్మ దుర్గా మాతను ఎక్కడ చూసినా సింహం పై స్వారీ చేస్తూ కనిపిస్తుంది. అందుకే దుర్గాదేవిని సింహవాహినీగా పిలుస్తారు. అయితే అమ్మవారు సింహవాహినిగా ఎలా అయ్యారు, సింహం అమ్మవారి వాహనంగా ఎలా మారిందో అనే ఇతివృత్తం చాలామందికి తెలిసి ఉండదు. మరి ఆ పురాణ గాథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పురాణ కథనం ప్రకారం..

అమ్మవారికి ఇష్టమైన వాహనం సింహం. వాస్తవానికి అమ్మవారు తొమ్మిది రూపాల యొక్క తొమ్మిది వేర్వేరు వాహనాలలో దర్శనం ఇస్తుంటారు. సింహం దుర్గామాతకు వాహనంగా ఎలా మారిందో తెలియజేసేందుకు పురాణాల్లో ఆసక్తికర కథ ఉంది. అది ఏంటంటే ఓ సారి పరమశివుడు ధ్యానస్థితిలోకి వెళ్లిపోయాడు. ఎన్ని రోజులైనా శివుడు ధ్యానం నుంచి బయటికి రాకపోవడంతో పార్వతీదేవి కైలాసాన్ని విడిచిపెట్టింది. అక్కడి నుంచి భూమి పైకి వచ్చి తపస్సు చేయడానికి దట్టమైన అడవిలోకి వెళ్లి ధ్యానంలో నిమగ్నమవుతుంది. సరిగ్గా అదే సమయానికి ఆకలితో ఉన్న ఓ సింహం దుర్గా రూపమైన పార్వతీదేవిని తినడానికి అమ్మవారి దగ్గరికి వస్తుంది.

అంతటితో ఆగకుండా భవాని మీద దాడి చేసేందుకు యత్నిస్తుంది. కానీ భవాని చుట్టూ రక్షణ కవచం ఉండడంతో సింహం భవాని మీద దాడి చేయలేకపోతుంది. ఆ తర్వాత కూడా ఆ సింహం భవాని ధ్యాన స్థితి నుంచి బయటకు వచ్చేదాకా అక్కడే వేచి చూస్తుంది. ఇంతలో ఆ పరమశివుడు గౌరీ మాత తపస్సుకు మెచ్చి ఆమెను అనుగ్రహిస్తాడు. కైలాసానికి పార్వతీదేవిని తీసుకెళ్లడానికి అడవికి చేరుకుంటాడు. అప్పుడు పార్వతీదేవి కఠోర ధ్యానం నుంచి మేల్కొని దేవి కోసం వేచి ఉన్న ఆకలితో ఉన్న సింహాన్ని చూస్తుంది. సింహాన్ని చూసిన పార్వతీదేవి తన శక్తితొ సింహం అక్కడ ఎందుకు వేచి చూస్తుందో గ్రహిస్తుంది. అడవికి రారాజైనా, సింహం క్రూర జంతువయినా సింహం దీనస్థితిని చూసిన పార్వతీమాత మాతృహృదయం చలిస్తుంది. క్రూర జంతువైన సింహం మీద జాలితో గౌరీదేవి దాన్ని తనతోపాటు కైలాసానికి తీసుకువెళుతుంది. ఆ రోజు నుంచి సింహం అమ్మవారికి వాహనంగా మారిపోయింది. అప్పటి నుంచి అమ్మవారిని సింహ వాహినిగా పిలుస్తారని పురాణాలు చెబుతున్నాయి.

మూడవ రోజు మాత చంద్రఘంటకు పూజలు..

05 అక్టోబర్ 2024 నవరాత్రుల మూడవ రోజు. ఈ రోజు మా చంద్రఘంటకు అంకితం చేసిన రోజు. ఈ రోజు చంద్రఘంటను పూజించడం ద్వారా విశేష ఫలితాలను ఇస్తుందని భక్తులు నమ్ముతారు. మహిషాసుర అనే రాక్షసుడు భీభత్సం సృష్టించడంతో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కలిసి మహాశక్తిని సృష్టించారని చెబుతారు. ఈ మహాశక్తినే మాత దుర్గా అని పిలుస్తారు. ముఖ్యంగా మూడవ అవతారం అయిన చంద్రఘంట అని పిలుస్తారు. ఈ రోజున పూజించడం వల్ల మనిషి జీవితంలో శాంతి, సంతృప్తి కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.


Similar News