600 ఏళ్ల నాటి అమ్మవారి ఆలయం.. ఎక్కడ ఉందో తెలుసా..
అనేక చారిత్రక ఆలయాలకు, పురాతన కట్టడాలకు నెలవు మన భారతదేశం.
దిశ, వెబ్‌డెస్క్ : అనేక చారిత్రక ఆలయాలకు, పురాతన కట్టడాలకు నెలవు మన భారతదేశం. ఈ క్రమంలోనే పోర్‌బందర్ జిల్లా కూడా పురాతన శివాలయాలకు, అమ్మవారికి దేవాలయాలకు ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాలు ఎన్నో ఏండ్ల చరిత్రను కలిగి ఉన్నాయి. అలాగే పోర్‌బందర్( Por Bandar ) నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేగాం గ్రామంలో ఉన్న నవదుర్గా చాముండ మాతాజీ ఆలయం కూడా ఎంతో ప్రసిద్ది గాంచింది. ఈ ఆలయంతో పాటు మెహర్ సమాజ్ (Mehr Samaj) ఇక్కడ ఒక గొప్ప సమాజ్ భవన్‌ను కూడా నిర్మించింది. ఇందులో వివాహాలు, ఇతర కార్యక్రమాలకు సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.
ఆలయ చరిత్ర, ప్రాముఖ్యత..
దేగాం గ్రామ చరిత్ర సుమారు 550 సంవత్సరాల నాటిదని అక్కడి ప్రజలు చెబుతున్నారు. కానీ ఈ ఆలయం చరిత్ర మాత్రం 600 సంవత్సరాలకు పైగా పురాతనమైనదిగా చెబుతున్నారు అక్కడి ప్రజలు. ఇక్కడి ప్రజలు చాముండా అమ్మవారిని ఎంతగానో విశ్వసిస్తారు. ఈ ఆలయ పునరాభివృద్ధి పనులు 2012లో ప్రారంభమయ్యాయి.
దేగాం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. ఈ ఆలయంలో చాముండ మాతాజీ విగ్రహంతో పాటు, ఇతర దేవతల విగ్రహాలు కూడా ప్రతిష్టించి ఉన్నాయి. దీని కారణంగా ఈ ప్రదేశం నవదుర్గా (Navadurga) ఆరాధనకు కూడా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం కేవలం మత విశ్వాసానికి చిహ్నంగా మాత్రమే కాకుండా, దాని చుట్టూ ఉన్న శతాబ్దాల నాటి చెట్లు కూడా ఉన్నాయి. ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటే ఎలాంటి కోరికలు అయినా నెరవేరతాయని భక్తుల నమ్ముతారు.