శ్రీరామనవమి రోజున రాములవారికి పానకం, వడపప్పు ఎందుకు నైవేద్యంగా పెడుతారో తెలుసా?

ఈ పండుగ రోజున శ్రీరాముడికి నైవేద్యంగా పానకం, వడపప్పు ప్రత్యేకంగా తయారుచేస్తారు.

Update: 2024-04-15 02:48 GMT

దిశ, ఫీచర్స్: శ్రీరామనవమి రోజే రాముడి పుట్టినరోజు. ఈ పవిత్రమైన రోజున రామభక్తులు సీతారాముల కళ్యాణాన్ని తిలకించి, శ్రీరామచంద్రమూర్తిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఈ సందర్భంగా శ్రీరామునికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించి పూజిస్తారు. అయితే ఈ పండుగ రోజున శ్రీరాముడికి నైవేద్యంగా పానకం, వడపప్పు ప్రత్యేకంగా తయారుచేస్తారు. వాటిని నైవేద్యంగా ఎందుకు సమర్పిస్తారో తెలుసుకుందాం.

శ్రీరామచంద్రుడికి బెల్లం అంటే చాలా ఇష్టమని పండితులు చెబుతున్నారు. ఆధ్యాత్మిక రామాయణం ప్రకారం, రాముడు వనవాస సమయంలో, రాముడు, సీత , లక్ష్మణులు పండ్లు, విత్తనాలు, మూలికలతో పానకం తయారు చేశారు. ఆయనకు ఋషులు వడపప్పు సమర్పించినట్లు కూడా కథనాలు ఉన్నాయి.

సంస్కృతి ప్రాముఖ్యత:

శ్రీరామ నవమి రోజున, భక్తులు సంప్రదాయబద్ధంగా పానకం, వడప్పలను తయారు చేసి, వాటిని స్వామికి సమర్పించి, ఆపై వాటిని ప్రసాదంగా తీసుకుంటారు. సామాజిక సమానత్వం, సహకారాన్ని ప్రోత్సహించడం ఈ పండుగ యొక్క ప్రధాన లక్ష్యాలలో ఒకటి.

పానకం: వేసవిలో చేసే శ్రీరామనవమిలో పానకం తాగడం వల్ల శరీరం చల్లబడుతుంది. యాలకులలో ఉండే ఔషధ గుణాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.

వడపప్పు : ఇందులో ఉండే ప్రోటీన్, ఫైబర్ పీచు పదార్థాలకు మూలం. పప్పు తినడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. 


Similar News