దేవుడి ఫొటోలు ఏ దిక్కున ఉండాలో తెలుసా
నిత్యం పూజ చేసే చాలా మందికి కూడా దేవుడు ఫొటోలు ఎటువైపు ఉండాలి? ఎలా ఉండాలి?
దిశ, వెబ్డెస్క్ : నిత్యం పూజ చేసే చాలా మందికి కూడా దేవుడు ఫొటోలు ఎటువైపు ఉండాలి? ఎలా ఉండాలి? అనే విషయం తెలియదు. ఇంట్లో దేవుడి గదిలో ఉంచే చిత్రపటాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ దేవుడువి కూడా రెండేసి పటాలు ఉంచరాదు. పగిలిన, చిరిగిపోయిన దేవుని విగ్రహాలు ఉంచకూడదు. నవగ్రహాల విగ్రహాలు, శనీశ్వరుని విగ్రహం, కులదైవం ఫొటోలు మూలలో ఉంచకూడదు. అదే విధంగా కోపంగా చూస్తున్న శివుని చిత్రపటాన్ని కానీ.. విగ్రహాన్ని కానీ ఇంట్లో ఉంచరాదు. కాళికాదేవి అసలే ఉండకూడదు. కొందరి ఇంట్లో శివలింగాన్ని ఉంచుకుంటారు. ఇలా ఉంటే శివునికి నిత్యం అభిషేకం జరిపించాలి.
ఏ దిక్కున ఉంచాలి
సూర్య భగవాన్ ని నమస్కరించేటప్పుడు తూర్పు తిరిగి నమస్కరిస్తాం. అదే విధంగా ఆయన ఫొటోను ఇంట్లో తూర్పు వైపు ఉంచడం చాలా మంచిది. దేవత మూర్తుల విగ్రహాలు అన్నింటిని కూడా ఇంట్లో తూర్పు వైపుగా ఆ చిత్రపటాలు పడమర వైపు చూస్తున్నట్టు పెట్టుకోవడం చాలా మంచిది. అలా సాధ్యం కాకపోతే పడమర వైపు ఉంచి తూర్పు వైపు చూస్తున్నట్టుగా పెట్టుకోవాలి. అంతే కాని ఎట్టిపరిస్థితిలో దక్షిణం వైపు ఏర్పాటు చేయకూడదు. లక్ష్మీదేవి ఫొటో దర్వాజకు ఎదురుగా ఉంచకపోవడం మంచిది. ఇలా ఉంటే ఇంట్లోని ధనమంతా బయటకు వెళ్లిపోతుంది. అలాగే ఆంజనేయస్వామి చిత్రపటాన్ని దర్వాజ పైన ఉంచకూడదు. అలా ఉంటే దరిద్రం సంక్రమిస్తుంది.
చనిపోయిన వారి ఫొటోలు...
చనిపోయిన వారు దేవతలతో సమానం. వారికి కూడా నిత్యం పూజలు చేయొచ్చు. కానీ వారి ఫొటోలు దేవతల పక్కనే ఉంచకూడదు. వీరి ఫొటోలను దక్షిణం వైపు మాత్రమే ఉంచాలి. అంటే ఉత్తరం వైపు చూస్తున్నట్టుగా పెట్టాలి. ఇతర ఏ దిక్కున కూడా వీరి ఫొటోలు పెట్టరాదు.