వారంలో ఏ రోజున ఏ రంగు బొట్టుపెట్టుకుంటే మంచిదో తెలుసా..

భారతదేశంలో నెలకొని ఉన్న అనేక ఆచారాలలో నుదుటి పై తిలకం పెట్టడం ఒకటి. దీన్ని ఆధ్యాత్మికతకు చిహ్నంగా పరిగణిస్తారు.

Update: 2024-09-13 15:23 GMT

దిశ, వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డెస్క్ : భారతదేశంలో నెలకొని ఉన్న అనేక ఆచారాలలో నుదుటి పై తిలకం పెట్టడం ఒకటి. దీన్ని ఆధ్యాత్మికతకు చిహ్నంగా పరిగణిస్తారు. ఇది కేవలం ఆచారం మాత్రమే కాదు జ్యోతిష్యం పరంగా, ఆరోగ్యం పరంగా కూడా ఎంతో ప్రయోజనకరమైనదంటున్నారు పండితులు. చాలా మంది ప్రజలు తమ ఇళ్లలో ఉదయం పూట పూజ చేసిన తర్వాతే తిలకం, కుంకుమ పెట్టుకుంటారు. దాదాపుగా రెడ్, మెరూన్ రంగు కుంకుమనే ఎక్కువగా నుదిటిపైన పెట్టుకుంటారు. అయితే వారంలో ఏ రోజున ఏ రంగు కుంకుమను ధరిస్తే మంచిదో చాలామందికి తెలసి ఉండదు. మరి పండితులు, జ్యోతిష్కులు ఏడు రోజుల్లో ఏ రోజున ఏ రంగు బొట్టు పెట్టుకోవాలని చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

వారంలోని రోజులు, కుంకుమ ప్రాముఖ్యత..

సోమవారం : సోమవారాన్ని శివుని రోజుగా పరిగణిస్తారు. ఈ రోజున తెల్ల చందనం లేదా బూడిద రంగు తిలకం, విభూది ధరించడం శుభప్రదం అంటున్నారు పండితులు. ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. సానుకూల శక్తిని అందిస్తుందంటున్నారు.

మంగళవారం : ఈ రోజున హనుమంతుడు, అంగారక గ్రహానికి సంబంధించిన రోజు కాబట్టి, ఎర్ర చందనం లేదా కుంకుమ తిలకం ధరించాలంటున్నారు పండితులు. ఇది ధైర్యాన్ని, శక్తిని అందిస్తుంది. అలాగే జీవితంలో పురోగతికి మార్గం తెరుస్తుందంటున్నారు.

బుధవారం: గణేశుడు, బుధ గ్రహంతో సంబంధం ఉన్న రోజు కాబట్టి ఆకుపచ్చ తిలకం లేదా అశోక ఆకుల తిలకాన్ని ధరించడం శుభప్రదంగా చెబుతున్నారు పండితులు. ఇలా చేయడం ద్వారా తెలివికి పదునుపెట్టి వ్యాపారంలో విజయాన్ని తెస్తుందంటున్నారు.

గురువారం : గురువారం బృహస్పతి, విష్ణువుకు అంకితం చేసిన రోజు. ఈ రోజున పసుపు గంధం లేదా పసుపు తిలకం పెట్టుకోవడం మంచిదంటున్నారు పండితులు. ఇది సంపద, జ్ఞానం, ఆనందం, శ్రేయస్సును కలిగిస్తుందని చెబుతున్నారు.

శుక్రవారం : శుక్రవారం లక్ష్మీ దేవి, శుక్ర గ్రహానికి సంబంధం ఉన్న రోజు. ఈ రోజున కుంకుమ తిలకం పెట్టుకుంటే శుభం కలుగుతుందంటున్నారు. ఇలా చేయడం ద్వారా సంపద, శ్రేయస్సును తెస్తుందని చెబుతున్నారు.

శనివారం : ఈరోజు శని దేవుని రోజు కాబట్టి ఈ రోజున నల్ల తిలకం లేదా శమీ ఆకుల తిలకం పెట్టుకుంటే మంచిదంటున్నారు పండితులు. దీంతో శని దోషం తొలగిపోయి నెగెటివ్ ఎనర్జీ నుంచి రక్షణ కలుగుతుందంటున్నారు.

ఆదివారం : ఈ రోజు సూర్య భగవానుడి రోజు కాబట్టి, ఈ రోజున ఎర్రచందనం లేదా వెర్మిలియన్ తిలకాన్ని పెట్టుకోవాలంటున్నారు పండితులు. ఇది ఆరోగ్యం, గౌరవాన్ని పెంచుతుంది. జీవితంలో విజయాన్ని కలిగిస్తుంది.

గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహనకోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. 


Similar News