ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ శివాలయాలు ఉన్నాయో తెలుసా..
మహాశివరాత్రి పండుగను ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలోని శుక్ల పక్ష చతుర్దశి రోజున ఎంతో వైభవంగా జరుపుకుంటారు.
దిశ, ఫీచర్స్ : మహాశివరాత్రి పండుగను ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలోని శుక్ల పక్ష చతుర్దశి రోజున ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఈసారి మహాశివరాత్రిని మార్చి 8, 2024 శుక్రవారం జరుపుకుంటారు. ఈ రోజు మహాదేవుని ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అయితే మహాదేవుని ప్రసిద్ధ ఆలయాల గురించి చెప్పాలంటే భారతదేశంలోని 12 ప్రధాన జ్యోతిర్లింగ ఆలయాలు శివునికి అంకితం చేశారు. కాశీని శివుని నగరం అంటారు. భారతదేశంలోనే కాదు విదేశాలలో కూడా శివుడిని పూజిస్తారట. భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా శివయ్య ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. దీనితో పాటు మహాశివరాత్రి రోజున, భోలేనాథ్ భక్తుల రద్దీ విదేశాలలోని శివాలయాల్లో ఉంటుంది. విదేశాల్లోని ప్రధాన శివాలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
విదేశాలలో ప్రసిద్ధి చెందిన శివాలయాలు
పశుపతినాథ్ ఆలయం నేపాల్..
భారతదేశం పొరుగు దేశం నేపాల్ లో అత్యంత ప్రసిద్ధ పశుపతినాథ్ ఆలయం చూడవచ్చు. శివరాత్రి రోజున లక్షలాది మంది శివ భక్తులు ఇక్కడికి చేరుకుని శివయ్య దర్శనం చేసుకుంటారు. పశుపతినాథ్ ఆలయం నేపాల్ రాజధాని ఖాట్మండులో ఉంది. కేదార్‌నాథ్‌ని దర్శించుకున్న తర్వాత నేరుగా పశుపతినాథుడిని దర్శించుకున్న వారు మళ్లీ భూలోకంలో జన్మించాల్సిన అవసరం లేదని ఒక నమ్మకం.
మున్నేశ్వరం, శ్రీలంక
శ్రీలంకలో మున్నేశ్వరం అనే పేరుతో చాలా పురాతనమైన శివుని ఆలయం ఉంది. ఈ ఆలయం రామాయణ కాలం నాటిదని చెబుతారు. రావణుడిని సంహరించిన తర్వాత రాముడు ఈ ఆలయంలో శివుడిని పూజించాడని పురాణాలు చెబుతున్నాయి. మహాశివరాత్రి రోజున ఈ ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.
అరుల్మిగు శ్రీరాజ కాళియమ్మన్ ఆలయం, మలేషియా
ఈ ప్రసిద్ధ శివాలయం మలేషియాలో ఉంది. ఈ ఆలయాన్ని 1922లో నిర్మించారు. ఆలయ ప్రత్యేకతల గురించి చెప్పాలంటే ఈ ఆలయం పూర్తిగా గాజుతో నిర్మించారు. దీని గోడల పై దాదాపు 30,00,00 రుద్రాక్ష పూసలు పొదిగారు.
ప్రంబనన్ ఆలయం, ఇండోనేషియా
ఈ ప్రసిద్ధ శివాలయం ఇండోనేషియాలోని జావా ప్రావిన్స్‌లో ఉంది. ప్రంబనన్ ఆలయం 8 దేవాలయాల సమూహం. దీనిని స్థానికంగా గోపురాలు అని పిలుస్తారు. ఈ ఆలయం 850 BC లో నిర్మించారు. ఈ శివుని ఆలయ గోడల పై, విష్ణువు, హనుమాన్, రామాయణ కాలం నాటి చిత్రాలు, ఇతర దేవతలు, దేవతల చిత్రాలు ఉన్నాయి. మహాశివరాత్రి రోజున ఈ ఆలయంలోని అతీంద్రియ సౌందర్యం చూడదగ్గది.
ముక్తి గుప్తేశ్వరాలయం, ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియాలో ఉన్న ముక్తి గుప్తేశ్వర్ శివుని ఆలయం. ఈ ఆలయం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. మహాశివరాత్రి సందర్భంగా ఈ ఆలయం లైట్లు చూడదగినవి. ఈ శివాలయం ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్‌లో ఉంది. ఈ ఆలయం చూడటానికి చాలా గొప్పగా ఉంటుంది. మహాశివరాత్రి రోజున భక్తులు దర్శనం కోసం ఇక్కడికి చేరుకుంటారు.