రావణుడు చనిపోయే ముందు రాముడికి ఏం చెప్పాడో తెలుసా?
రావణుడు చనిపోయేముందు రామునితో ఈ మాటలు చెప్పడంట. లంకాధిపతి రావణబ్రహ్మ యుద్ధ భూమిలో..మృత్యు శయ్యపై అవసాన దశలో శ్రీరామునితో ఇలా అన్నాడు.
దిశ,వెబ్‌డెస్క్: రావణుడు చనిపోయేముందు రామునితో ఈ మాటలు చెప్పడంట. లంకాధిపతి రావణబ్రహ్మ యుద్ధ భూమిలో..మృత్యు శయ్యపై అవసాన దశలో శ్రీరామునితో ఇలా అన్నాడు.“రామా !! నీ కంటే నేను అన్నింటిలో గొప్పవాణ్ణి. నేను బ్రాహ్మణ జాతిలో పుట్టాను. నీది క్షత్రియ జాతి. నేను నీ కంటే వయసులో పెద్ద. నా కుటుంబం..మీ కుటుంబం కన్నా పెద్ద. నా వైభవం..నీ వైభవం కన్నా అధికం. మీ అంత:పురమే స్వర్ణం..నా లంకానగరమే స్వర్ణమయం. నేను బలపరాక్రమాలలో..నీ కంటే శ్రేష్ఠుడిని. నా రాజ్యము,నీ రాజ్యము కంటే పెద్దది. జ్ఞానంలో, తపస్సులో నీ కంటే శ్రేష్ఠుడిని”.
“ఇన్ని శ్రేష్ఠమైన విషయాలు కలిగి వున్నా ..యుద్ధంలో నేను నీ ముందు ఓడిపోయాను. దీనికి కారణం ఒకటే..నీ తమ్ముడు నీ దగ్గర వున్నాడు..నా తమ్ముడు నన్ను వదలి వెళ్ళిపోయాడు”. కుటుంబం పరివారమే వెంట ఉంటే ఎంతటి కష్టంలో, యుద్ధంలోనైనా విజయం సాధించవచ్చు. పరివారమే కుటుంబమైతే ఆనందం మన వెంటే ఉంటుంది. కుటుంబం దూరమైతే బతుకే భారమవుతోంది. రావణబ్రహ్మ లాంటి వాడే ఓటమి పాలయ్యాడు. ఇది కేవలం సోషల్ మీడియా ద్వారా సేకరించిన కథనం మాత్రమే. దీనికి ‘దిశ’కు ఎటువంటి సంబంధం లేదు.