పూజలో దీపాలు వెలిగించేటప్పుడు పాటించాల్సిన నియమాలేంటో తెలుసా ?

హిందూ సాంప్రదాయంలో దీపానికి ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.

Update: 2024-02-02 08:35 GMT

దిశ, ఫీచర్స్ : హిందూ సాంప్రదాయంలో దీపానికి ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దేవాలయాలలో, ఇంటిలో నిత్యం దీపారాధన చేస్తూ ఉంటారు. అలాగే ఏ పూజా కార్యక్రమంలో అయినా దీపాలు కచ్చితంగా వెలిగిస్తారు. ఈ సంప్రదాయం పురాతన కాలం నుంచి వస్తుంది. ఏ పూజ కార్యక్రమమైనా దీపం వెలిగించడంతో ప్రారంభమవుతుంది. దీపం వెలిగించకుండా చేసే పూజలు అసంపూర్ణమని పండితులు, శాస్త్రాలు చెబుతున్నాయి.

అందుకే పూజ సమయంలో దీపాలు వెలిగించే సంప్రదాయాన్ని ప్రతి ఒక్కరు పాటిస్తారు. అయితే దీపాలు వెలిగించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. చాలా మంది ప్రజలు ఆ నియమాలను పాటించరు. దీని వల్ల వారు పూజ చేసిన శుభ ఫలితాలను అంతంతమాత్రంగానే పొందుతారు. అయితే చేసిన ఫలితం పూర్తిగా పొందడానికి దీపం వెలిగించేటప్పుడు ఈ నియమాలను కచ్చితంగా పాటించాలి. మరి ఆ నియమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

దీపం వెలిగించే సమయంలో పాటించాల్సిన నియమాలు..

పూజ సమయంలో వెలిగించే దీపం శుభ్రంగా ఉండాలి. అలాగే పూజలో ఉపయోగించే దీపం ఎక్కడా పగలకుండా ఉండాలి. పూజలో పగిలిన దీపాన్ని ఉపయోగించడం వల్ల అశుభం కలుగుతుంది. మీరు పూజ ప్రారంభంలో దీపం వెలిగించినప్పుడు, దీపంలో తగిన మోతాదులో నెయ్యి లేదా నూనె ఉండేలా జాగ్రత్త పడాలి. అప్పుడు పూజ ముగిసేలోపు దీపం ఆరిపోకుండా ఉంటుంది. పూజ మధ్యలో దీపం ఆరిపోవడాన్ని చెడు శకునంగా భావిస్తారు.

పూజ సమయంలో నెయ్యి దీపం వెలిగించిన వెంటనే మరో నూనె దీపాన్ని వెలిగించకూడదు. దీపాన్ని పూజా స్థలం మధ్యలో, దేవుని విగ్రహం ముందు ఉంచాలి. నెయ్యి దీపం వెలిగిస్తే, నెయ్యి దీపాన్ని మీ ఎడమ వైపున ఉంచండి. మీరు నూనె దీపం వెలిగిస్తే, దానిని మీ కుడి వైపున పెట్టాలి. నూనె దీపంలో ఎర్రటి వత్తిని ఉపయోగించడం శుభప్రదంగా భావిస్తారు. ఇంటిలో వెలిగించే దీపానికి దూదిని ఉపయోగించి స్వయంగా వత్తులు చేసి వెలిగిస్తే శుభప్రదమని భావిస్తారు. పూజా స్థలంలో దీపాన్ని ఎప్పుడూ పడమర దిశలో ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు.

Read More Devotional News

Tags:    

Similar News