శివునికి, రుద్రాక్షలకు ఉన్న సంబంధం ఏంటో తెలుసా?

శివరాత్రి ఎంతో పర్వదినం. ఇది హిందువులకు చాలా ప్రత్యేకమైన పండుగ. ఈసారి ఫిబ్రవరి 18న శివరాత్రి వస్తుంది. ఇక ఈరోజు రుద్రాక్ష ధరించి, ధ్యానం చేయడం వలన మంచి జరుగుతుంది

Update: 2023-02-16 03:38 GMT

 దిశ, వెబ్‌డెస్క్ : శివరాత్రి ఎంతో పర్వదినం. ఇది హిందువులకు చాలా ప్రత్యేకమైన పండుగ. ఈసారి ఫిబ్రవరి 18న శివరాత్రి వస్తుంది. ఇక ఈరోజు రుద్రాక్ష ధరించి, ధ్యానం చేయడం వలన మంచి జరుగుతుంది అంటారు. ఇఅంతే కాకుండా రుద్రాక్ష ధరించడం వలన కష్టాలు నశించి గ్రహదోషాలు తొలిగిపోయి జీవితం సంతోషంగా సాగుతది అంటారు. ఇక అయితే రుద్రాక్షకు, శివునికి ఎలాంటి సంబంధం ఉందో ఇప్పుడు చూద్దాం.

పురాణాల ప్రకారం.. శివుడు వెయ్యి సంవత్సరాల పాటు ధ్యానంలో మునిగిపోయి. ఒకరోజు అకస్మాత్తుగా కళ్ళు తెరిచి చూసినప్పుడు ఆయన ముందే ఓ కన్నీటి చుక్క భూమిపై పడిందట. దాని నుంచే రుద్రాక్ష ఉద్భవించినట్లు పండితులు చెబుతారు. శివుని ఆజ్ఞతో మానవ కల్యాణం కోసం రుద్రాక్ష వృక్షాలు భూమి అంతటా వ్యాపించాయి. ఇదేనట శివునికి రుద్రాక్షకు ఉన్న సంబంధం.

Tags:    

Similar News