Bhakti: భక్తికి , ధర్మానికి తేడా ఏంటో తెలుసా?
భగవంతుని మీద ఎనలేని ప్రేమను భక్తి అంటారు.
దిశ వెబ్ డెస్క్ : భక్తికి , ధర్మానికున్న తేడా ఏంటో తెలుసా ..అవి రెండు ఒకటేనా.. కానీ వాస్తవానికి భక్తి వేరు, ధర్మం వేరు. భగవంతుని మీద ఎనలేని ప్రేమను భక్తి అంటారు. అనంత విశ్వాన్ని రక్షించేది ధర్మం. వ్యాసుడు భగవత్గీత శాస్త్రాన్ని ధర్మ క్షేత్రే అని అని ధర్మ శబ్దంతో ప్రారంభించాడు. దానికి వ్యాఖ్యాతలు ఈ ధర్మ శబ్దం దైవ వాచకంగా వాడబడిందని నిర్వచించారు. ఇది న్యాయమనే అర్థంలో కూడా వాడతారు. ఈ ధర్మం కృత యుగంలో నాలుగు పాదాలుగా , త్రేతా యుగంలో మూడు పాదాలుగాను, ద్వాపర యుగంలో రెండు పదాలుతోను , కలి యుగంలో ఒక పాదంతోను సంచరిస్తుందని శాస్త్రాలు , పురాణాలు చెబుతున్నాయి. ధర్మము నందు భక్తి మోక్షానికి మార్గం. ధర్మంతో అర్ధం సంపాదించి ధర్మ బద్దమైన కామాన్ని అనుభవించి మోక్షాన్ని పొందవలిసిందేనని నిర్దేశింపబడింది.