శ్రీ రాముడికి అక్క ఉందని తెలుసా.. ఆమె ఎవరంటే..?

రాముడు త్రేతాయుగంలో అవతరించాడు

Update: 2024-04-18 04:56 GMT

దిశ, ఫీచర్స్: రాముడు త్రేతాయుగంలో అవతరించాడు.రాముడు చైత్రశుధ్ద నవమిరోజున కర్కాటక లగ్నం, పునర్వసు నక్షత్రంలో జన్మించాడు. అతనికి లక్ష్మణ, భరత, శతృఘ్న సోదరులు ఉన్నారు. దశరథ మహారాజు తన వారసుల కోసం పుత్రకామేష్టి యజ్ఞం చేశాడు. అప్పుడు దివ్య పురుషుడు అగ్ని గుండంలో నుంచి బయటకు వచ్చి బంగారు పళ్లేంలో పాయసం ప్రసాదించాడు.

దశరథుడు తన ముగ్గురు భార్యలు కౌసల్య, సుమిత్ర, కైకేయికి సమానంగా పాయసం పంచాడు. ఈ ముగ్గురు రాణులకు తర్వాత నలుగురు పిల్లలు పుట్టారు. రామయ్యను సీతమ్మకు, లక్ష్మణుడుని ఉర్మిళకు, భరతుడిని మాండవికి, శత్రుఘ్నుడిని శృతకీర్తికి ఇచ్చి ఘనంగా వివాహం జరిపిస్తారు.

రాముడికి ఒక సోదరి ఉందన్న విషయం మనలో చాలామందికి తెలీదు. ఆమె పేరు శాంతా దేవి. దశరథుడు పుత్రకామేష్టి యాగం చేసే ముందు శాంతాదేవి జన్మించిందని పురాణాలు చెబుతున్నాయి. కానీ శాంతాదేవి పుట్టుకతోనే వికలాంగురాలు. మంత్రుల సలహా మేరకు దశరథుడు ఆమెను అంగదేశ రాజు రోమాపాదుడికి దత్తత ఇచ్చాడు. రోమపాదుడు శాంతాదేవికి తగిన వైద్యం చేసి నయం చేశాడు. దీంతో శాంతా దేవీ ఆరోగ్యం కుదుటపడి, ఆమె ఎంతో సౌందర్యంగా మారిపోయిందంట.


Similar News