ఆలయంలో మద్యం సేవిస్తున్న అమ్మవారు.. రెండున్నర కప్పులు బస్..

సాధారణంగా ఆలయాల్లో దేవుళ్లకి అనేక రకాల నైవేద్యాలు పెడుతూ ఉంటారు.

Update: 2024-10-05 09:45 GMT

దిశ, వెబ్ డెస్క్ : సాధారణంగా ఆలయాల్లో దేవుళ్లకి అనేక రకాల నైవేద్యాలు పెడుతూ ఉంటారు. అలాగే అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు మాతా రాణికి లడ్డూలు, పేడాలు, బర్ఫీలతో పాటు 56 రకాల వంటకాలను నైవేద్యంగా పెడతారు. అయితే అక్కడక్కడ కొన్ని కొన్ని ఆలయాల్లో మాత్రం దేవుళ్లకి విచిత్రంగా బిర్యానీ, సిగరెట్, మాంసం వంటి వాటిని నైవేద్యంగా పెట్టడం చూసే ఉంటాం. అలాగే ఇప్పుడు మనం చెప్పుకునే ఆలయంలో అమ్మవారికి మద్యాన్ని నైవేద్యంగా పెడతారట. వింటుంటేనే వింతగా ఉంది కదా. ఇంతకీ ఇది ఏ అమ్మవారి ఆలయం, ఎక్కడ ఉంది అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

అమ్మవారికి మద్యం నైవేద్యంగా పెట్టే ఆలయం రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలోని భన్వాల్ గ్రామంలో ఉంది. ఈ అమ్మవారిని భన్వాల్ మాత అని పిలుస్తారు. భన్వాల్ మాతను కాళీ మాత రూపంగా భావిస్తారు. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు ఈ తల్లికి మద్యాన్ని నైవేద్యంగా నివేదిస్తారు. అది కూడా కేవలం రెండున్నర కప్పుల మద్యాన్ని మాత్రమే అని చెబుతున్నారు. ఈ ఆలయంలో ఈ సంప్రదాయం వందల ఏళ్లుగా కొనసాగుతోందని అక్కడికి వచ్చే భక్తులు చెబుతున్నారు. ఈ ఆలయంలోని మరో విశేషమేమిటంటే అమ్మవారికి పూజారి మద్యాన్ని నైవేద్యంగా పెట్టగానే అమ్మవారు మద్యాన్ని సేవిస్తారని చెబుతున్నారు. మరో మరో విశేషమేమిటంటే ఈ ఆలయాన్ని పూర్వం ఏ రాజులో, గ్రామ పెద్దనో కాకుండా దోపిడీ దొంగలు పునరుద్ధరించారని ఆలయ చరిత్ర చెబుతుంది. నేలను చీల్చిన చెట్టు కింద భన్వాల్ మాత కనిపించిందని చెబుతారు చెబుతారు.

వెండి కప్పులో అమ్మవారికి మద్యం..

ఆలయ పూజారి మద్యంతో నిండిన ఒక వెండి కప్పును భన్వాల్ దేవి ముందు ఉంచి ఆయన కళ్ళు మూసుకుని ప్రసాదాన్ని స్వీకరించమని అభ్యర్థిస్తారట. కొద్దిసేపటికే కప్పులోంచి మద్యం మాయమవుతుందని అక్కడి భక్తులు, పూజారులు చెబుతున్నారు. ఇలా మూడు సార్లు చేస్తారట. మూడోసారి కప్పులో ఉన్న సగం మద్యం మాత్రమే అయిపోతుందట. అమ్మ రెండున్నర కప్పుల మద్యాన్ని మాత్రమే తీసుకుంటుందని చెబుతారు.

భన్వాల్ దేవి ఆలయాన్ని నిర్మించిన బందిపోట్లు..

పూర్వం కొంతమంది దొంగలు ఒక గ్రామాన్ని దోచుకున్నారట. ఈ సమయంలో రాజు సైన్యం అక్కడకు వచ్చి వారిని పట్టుకోవడం ప్రారంభించిందట. అప్పుడు భన్వాల్ మాత రాజు సైన్యాన్ని గొర్రెలు, మేకలుగా మార్చేసిందట. ఆ తర్వాత బందిపోట్లు మాత ఆలయాన్ని నిర్మించి పూజలు చేయడం ప్రారంభించారని పురాణాలు చెబుతున్నాయి. ఆలయంలోని పురాతన శాసనం ప్రకారం ఈ ఆలయం 12వ శతాబ్దం కంటే పురాతనమైనదట. అంతే కాదు ఈ ఆలయం ఎర్ర రాళ్లతో నిర్మించారు. ఈ ఆలయం రాజస్థాన్‌లోని ప్రసిద్ధ శక్తిపీఠాలలో ఒకటిగా చెబుతారు.

విరాజిత్ ఆలయ గర్భగుడిలో బ్రాహ్మణి, కాళీమాత రెండు విగ్రహాలు ఉంటాయి. కుడివైపు బ్రాహ్మణి మాత ఉంటుంది ఈ అమ్మవారికి తీపి ప్రసాదాన్ని అందిస్తారు. ఎడమ వైపున ఉన్న రెండవ విగ్రహం కాళీమాత (భన్వాల్ మాత) ఈ అమ్మవారికి మద్యాన్ని నైవేద్యంగా పెడతారు. లక్షలాది మంది భక్తులు తమ కోరికలు నెరవేరేందుకు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు.


Similar News