111 అడుగుల బంగారు శివుడి విగ్రహం ఎక్కడుందో తెలుసా? (వీడియో)
పరమశివుడి ఆలయాలు దేశ వ్యాప్తంగా ఎన్నో ఉన్నాయి. అయినా ఏ గుడి ప్రత్యేకత దానికే ఉంటుంది..
దిశ, వెబ్ డెస్క్: పరమశివుడి ఆలయాలు దేశ వ్యాప్తంగా ఎన్నో ఉన్నాయి. అయినా ఏ గుడి ప్రత్యేకత దానికే ఉంటుంది. మహాశివరాత్రి నాడు శివుడిని ఎంతో ప్రత్యేకంగా ఉపవాసం ఉండి పూజిస్తారు. ముఖ్యంగా గుజరాత్‌లోని బంగారు శివుడి విగ్రహం వద్ద వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి.
వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని వడోదరలో సుర్‌సాగర్ సరస్సు మధ్యలో 111 అడుగుల బంగారు శివుడి విగ్రహం కొలువై ఉంది. మంజల్ ఎమ్మెల్యే యోగేష్ పటేల్ అధ్వర్యంలోని 'సత్యం శివం సుందరం సమితి' ట్రస్ట్ శివుడి విగ్రహాన్ని 2002లో ఏర్పాటు చేసింది. ముందుగా ఆ విగ్రహాన్ని రాగితో ఏర్పాటుచేశారు. దీనికి భక్తుల సహాయంతో 2012లో ఈ భారీ విగ్రహానికి బంగారుపూత పూశారు. దీనికి మొత్తం రూ.12 కోట్ల వ్యయంతో 17.5 జీల బంగారం ఖర్చు చేశారు. ఇది సుర్‌సాగర్ సరస్సు మధ్యలో వెలసి అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ రోజు శివరాత్రి కాబట్టి సోషల్ మీడియాలో చక్కర్ల కొడుతుండటంతో నెటిజన్లు శంభోశంకర అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Gold plated Shiva Statue at Sursagar lake Vadodara. pic.twitter.com/DYKRRey8UE
— Sunita Rathva (@RathvaS7) February 17, 2023