పుష్కరాల్లో కోవిడ్ నిబంధనలకు తూట్లు
దిశ, వెబ్‌డెస్క్: తుంగభద్ర పుష్కరాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దీంతో నదీతీరంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తుల ఆరోగ్యం దృష్ట్యా అధికారులు కోవిడ్ నిబంధనలు విధించారు. అంతేగాకుండా పుష్కరస్నానాలకు వచ్చే ప్రతీ భక్తుడికి కోవిడ్ టెస్టు తప్పనిసరి చేయాలని స్థానిక కలెక్టర్ వీరపాండ్యన్ అధికారులను ఆదేశించారు. భక్తులకు ఆన్‌లైన్‌లో కాకుండా.. ఆఫ్‌లైన్‌లో కూడా ఈ టికెట్లు ఇవ్వాలని సూచించారు. అయితే చాలామంది భక్తుల్లో కరోనా భయం పోయి, పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మాస్కులు లేకుండా, భౌతికదూరం పాటించకుండా […]
దిశ, వెబ్‌డెస్క్: తుంగభద్ర పుష్కరాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దీంతో నదీతీరంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తుల ఆరోగ్యం దృష్ట్యా అధికారులు కోవిడ్ నిబంధనలు విధించారు. అంతేగాకుండా పుష్కరస్నానాలకు వచ్చే ప్రతీ భక్తుడికి కోవిడ్ టెస్టు తప్పనిసరి చేయాలని స్థానిక కలెక్టర్ వీరపాండ్యన్ అధికారులను ఆదేశించారు. భక్తులకు ఆన్‌లైన్‌లో కాకుండా.. ఆఫ్‌లైన్‌లో కూడా ఈ టికెట్లు ఇవ్వాలని సూచించారు. అయితే చాలామంది భక్తుల్లో కరోనా భయం పోయి, పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మాస్కులు లేకుండా, భౌతికదూరం పాటించకుండా నిబంధనలకు తూట్లు పొడుతున్నారు. దీంతో అప్రమత్తమైన దేవాదాయ అధికారులు నిబంధనలకు మరింత కఠినతరం చేశారు.