కొత్త పనులకు బ్రేక్.. పాత పనులకు ఓకే

దిశ‌, వ‌రంగ‌ల్ తూర్పు: నిన్న‌టి వ‌ర‌కు శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాల‌తో ఉరుకులు ప‌రుగులు పెట్టిన నేత‌ల‌కు ఎన్నిక‌ల నోటిఫికేష‌న్‌ రావడంతో గప్ ‌చుప్ అయ్యారు. దీంతో శుక్ర‌వారం న‌గ‌రంలో నిశ్శ‌బ్ధ వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వ‌స్తుంద‌ని ముందే తెలియ‌డంతో వ‌రంగ‌ల్ మ‌హా న‌గ‌ర‌పాల‌క సంస్థ ప‌రిధిలోని ఎమ్మెల్యేలు వారం రోజులుగా పోటీ ప‌డి అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్లొన్నారు. వ‌రంగ‌ల్ తూర్పు ఎమ్మెల్యే న‌న్న‌పునేని న‌రేంద‌ర్ బుధ‌వారం ఒక్క రోజే సుమారు 40 కార్య‌క్రమాల్లో పాల్గొని రికార్డు సృష్టించారు. […]

Update: 2021-02-12 20:13 GMT

దిశ‌, వ‌రంగ‌ల్ తూర్పు: నిన్న‌టి వ‌ర‌కు శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాల‌తో ఉరుకులు ప‌రుగులు పెట్టిన నేత‌ల‌కు ఎన్నిక‌ల నోటిఫికేష‌న్‌ రావడంతో గప్ ‌చుప్ అయ్యారు. దీంతో శుక్ర‌వారం న‌గ‌రంలో నిశ్శ‌బ్ధ వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వ‌స్తుంద‌ని ముందే తెలియ‌డంతో వ‌రంగ‌ల్ మ‌హా న‌గ‌ర‌పాల‌క సంస్థ ప‌రిధిలోని ఎమ్మెల్యేలు వారం రోజులుగా పోటీ ప‌డి అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్లొన్నారు. వ‌రంగ‌ల్ తూర్పు ఎమ్మెల్యే న‌న్న‌పునేని న‌రేంద‌ర్ బుధ‌వారం ఒక్క రోజే సుమారు 40 కార్య‌క్రమాల్లో పాల్గొని రికార్డు సృష్టించారు. ఇదే ఒక‌వ‌డిని గురువారం కూడా కొన‌సాగించారు. అదే విధంగా ప‌శ్చిమ ఎమ్మెల్యే దాస్యం విన‌య్‌ భాస్క‌ర్‌ కూడా ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శ్రీ‌కారం చుట్టారు. వ‌ర్ధ‌న్న‌పేట ఎమ్మెల్యే అరూరి ర‌మేశ్ ద్విచ‌క్ర‌వాహ‌నంపై మేయ‌ర్‌తో క‌లిసి ప‌లు అభివృద్ధి ప‌నుల‌ను ప్రారంభించారు. మ‌డికొండ‌లో స్టేష‌న్ ఘ‌న్‌పూర్ ఎమ్మెల్యే తాటిప‌ల్లి రాజ‌య్య‌, ఆరెప‌ల్లి శివారు ప్రాంతాల్లో ప‌ర‌కాల ఎమ్మెల్యే రెడ్డి ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శ్రీ‌కారం చుట్టారు.

ఆశ‌లు.. అడియాశ‌లు

వ‌రంగ‌ల్ న‌గ‌ర‌పాల‌క సంస్థ పాల‌క వ‌ర్గం ప‌ద‌వీ కాలం మార్చి 14తో ముగియ‌నుంది. అదే రోజు శాస‌న మండ‌లికి ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్నారు. మార్చి 17న ఓట్ల లెక్కింపు కార్య‌క్ర‌మం చేప‌ట్ట‌నున్నారు. దీంతో చివ‌రి రోజుల్లో ప‌ద‌విలో లేకుండానే బ‌ల్దియా పాల‌క మండ‌లి ప‌ద‌వీ కాలం ముగుస్తోంది. నోటిఫికేష‌న్ కొంత ఆల‌స్యంగా వ‌స్తే చివ‌రి స‌మావేశాన్ని ఏర్పాటు చేసుకుందామంటూ మేయ‌ర్ 8న జ‌రిగిన స‌మావేశంలో ప్ర‌క‌టించారు. అప్పుడే మిగిలిన ప‌నులేమైనా ఉంటే వాట‌న్నింటికీ పాల‌నా ప‌ర‌మైన అనుమ‌తులు పొందుదామంటూ వెల్ల‌డించారు. ఆ ఆశ నెర‌వేర‌కుండానే పాల‌క వ‌ర్గం ప‌ద‌వీ కాలం ముగిసింది.

కొత్త‌ ప‌నుల‌కు బ్రేక్‌..

మూడు నెల‌ల కాలంలో నాలుగు పాల‌క‌వ‌ర్గ స‌మావేశాలు నిర్వ‌హించి సుమారు రూ.500 కోట్ల‌తో 600 ప‌నుల‌కు పైగానే చేప‌ట్టేలా అనుమ‌తులు పొందారు. అయితే ఇందులో సుమారు రెండు వంద‌ల ప‌నులు ప్ర‌తిపాద‌న‌లు రూపొందించే స్థాయిలోనే ఉండ‌గా సుమారు వంద ప‌నుల‌కుపైగా టెండ‌ర్ ప్ర‌క్రియ ద‌శ‌లో ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్‌తో ఈ ప‌నుల‌న్నింటికీ బ్రేక్ ప‌డింది. దీంతో కొన్ని డివిజ‌న్ల‌లో అభివృద్ధి పనులు ఆగిపోవ‌డంతో కార్పొరేట‌ర్లు ఆందోళ‌న చెందుతున్నారు.

పాత ప‌నుల‌కు ఓకే..

కొంత మంది కొర్పొరేట‌ర్లు ముందే మేల్కొని త‌మ డివిజ‌న్లలో చేపట్టాల్సిన ప‌నుల‌కు స్థానిక ఎమ్మెల్యేల‌తో కొబ్బ‌రి కాయ‌లు కొట్టించి శంకుస్థాప‌న ముగించారు. కొన్నింటికి ప్ర‌తిపాద‌న‌లు రూపొందించ‌క‌పోయినా, టెండ‌ర్లు పూర్తి కాకున్నా ప‌నుల‌కు ఎలాంటి అవ‌రోధాలు ఏర్ప‌డ‌కుండా ముంద‌స్తుగా ఈ కార్య‌క్ర‌మాన్ని పూర్తి చేశారు.

Tags:    

Similar News