సిలిండర్‌లోని 60శాతం ఆక్సిజన్‌ను సేవ్ చేసే ‘ఆక్సిసర్వ్’
దిశ, ఫీచర్స్ : మహమ్మారి సమయంలో ఆక్సిజన్ ఎంతో విలువైనదిగా, ఎన్నో ప్రాణాలను రక్షించే ‘ప్రాణ వాయువు’గా మారుతుందని ఎవరూ ఊహించలేదు. దాంతో కొవిడ్ భారినపడి ఆక్సిజన్ అందక ప్రాణాలు కొల్పోతున్న ఎంతో మందిని చూస్తూనే ఉన్నాం. అయితే బాధితులకోసం ప్రభుత్వ రంగాలతోపాటు, ప్రైవేట్ వర్గాలు, స్వచ్ఛంద సంస్థలు, సాయం చేయగలిగిన వ్యక్తులు ఎంతోమంది ఆక్సిజన్ సిలిండర్లు అందిస్తున్నారు. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్‌కి చెందిన అన్నదమ్ములు ప్రతి సిలిండర్‌లో 60% ఆక్సిజన్‌ను సంరక్షించడంలో సహాయపడే ఓ కొత్త […]
దిశ, ఫీచర్స్ : మహమ్మారి సమయంలో ఆక్సిజన్ ఎంతో విలువైనదిగా, ఎన్నో ప్రాణాలను రక్షించే ‘ప్రాణ వాయువు’గా మారుతుందని ఎవరూ ఊహించలేదు. దాంతో కొవిడ్ భారినపడి ఆక్సిజన్ అందక ప్రాణాలు కొల్పోతున్న ఎంతో మందిని చూస్తూనే ఉన్నాం. అయితే బాధితులకోసం ప్రభుత్వ రంగాలతోపాటు, ప్రైవేట్ వర్గాలు, స్వచ్ఛంద సంస్థలు, సాయం చేయగలిగిన వ్యక్తులు ఎంతోమంది ఆక్సిజన్ సిలిండర్లు అందిస్తున్నారు. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్‌కి చెందిన అన్నదమ్ములు ప్రతి సిలిండర్‌లో 60% ఆక్సిజన్‌ను సంరక్షించడంలో సహాయపడే ఓ కొత్త డివైజ్‌ను రూపొందించారు.
కరోనా వైరస్ సోకి ఆక్సిజన్ స్థాయిలు కోల్పోయిన వారికి ‘ఆక్సిజన్ సిలిండర్ల’తో ప్రాణవాయువు అందిస్తూనే.. ‘ఆక్సిసర్వ్’తో ఆక్సిజన్ వృథాకాకుండా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు ఎంపీకి చెందిన రూపేష్, గునేంద్ర మహోర్. సిలిండర్‌లోని వాయువును సమర్థవంతంగా వాడుకునేందుకు ఈ డివైజ్ ఉపయోగపడుతుంది. దాదాపు 60% ఆక్సిజన్ ఈ ‘ఆక్సిసర్వ్’ ఆదా చేస్తుంది. పల్స్ విడ్త్ మాడ్యులేషన్ (పిడబ్ల్యుఎం) ఫ్లక్స్ కంట్రోల్ సూత్రాలను ఉపయోగించే ఆక్సిసర్వ్‌ను రూపొందించడానికి రెస్పిరేటరీ, ఫ్లో, ఇసిజి సెన్సార్లు, ఆక్సిమీటర్ మాడ్యూల్స్, ఫ్లో కంట్రోల్ వాల్వ్ పరిగణలోకి తీసుకున్నారు. రెస్పిరేటరీ రేట్ చెక్ చేసేందుకు రెస్పిరేటరీ సెన్సార్‌ను ఆక్సిసర్వ్ నిర్దేశిస్తుంది.
ఈక్రమంలో SpO2 స్థాయిలు (ఆక్సిజన్ సంతృప్తత), ఆక్సిజన్ ఫ్లోపై పనిచేసే అల్గారిథం, ఊపిరి తీసుకుని వదిలేటపుడు ఆక్సిజన్ ఎంతమేరకు అవసరమవుతుందో అంతే స్థాయిలో విడుదల చేస్తుంది. దీంతో ఆక్సిజన్ వృథా కాకుండా వినియోగించుకోవచ్చు. అయితే దాంట్లో పరికరం లేదా సెన్సార్లు విఫలమైనప్పటికీ మైక్రో కంట్రోలర్‌లోని వైఫై మాడ్యూల్ ద్వారా అన్ని డైనమిక్ డేటా పారామితులను డాష్‌బోర్డ్‌కు రిలే చేస్తుంది.
గ్వాలియర్‌లోని మాధవ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తిచేశారు రూపేష్, గునేంద్ర. అయితే గత నెలలో జరిగిన ఐసిఆర్టిఎస్టి -21 సమావేశంలో పరిశోధనా పత్రంగా తమ డివైజ్ డిజైన్, పనితీరును సబ్‌మిట్ చేశారు. కొన్ని చిన్న మార్పుల తరువాత ఇది ఆమోదం పొందడంతో ఎన్ఐటి రూర్కెలా ఇంక్యుబేటర్ (ఫౌండేషన్ ఫర్ టెక్నాలజీ & బిజినెస్ ఇంక్యుబేషన్) నుంచి ప్రీ-ఇంక్యుబేషన్ ఆఫర్ కూడా అందుకున్నారు.
‘ఎంపీలో పరిస్థితి చాలా దారుణంగా మారిపోవడంతో.. సిఓపిడి (క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజెస్) పై పత్రికలు, పరిశోధనా పత్రాలను చదవడం ప్రారంభించాం. చికిత్సలో ఉన్న రోగికి ఆక్సిజన్ 24×7 సరఫరా చేస్తారు. ఇక్కడ వాస్తవం ఏమిటంటే ఊపిరి వదిలేటప్పుడు రోగికి ఆక్సిజన్ అవసరం లేదు. అయితే ఉచ్ఛ్వాస సమయంలోనే కాదు ప్రతిసారి మనం తీసుకునే శ్వాసతో ఆక్సిజన్ పరిమాణం మారుతూ ఉంటుంది. ఈ నాన్-లీనియర్ శ్వాస పద్ధతిని తెలుసుకునేందుకు ఎయిమ్స్ భువనేశ్వర్, జిప్‌మర్, ఇతర వైద్య విద్యార్థులు, వైద్యులను అడిగి తెలుసుకున్నాం. దీని ఆధారంగానే మేం ఆక్సిసర్వ్‌ను రూపొందించాం. సాఫ్ట్‌వేర్ సాయంతో డివైజ్ పనితీరును పరీక్షించాం. కాని క్లినికల్ ట్రయల్స్‌తో మరింత ముందుకు వెళ్ళాలి. అంతా సజావుగా సాగితే, త్వరలోనే దీన్ని మార్కెట్లోకి తీసుకువస్తాం’
– రూపేష్, గునేంద్ర, ఆక్సిసర్వ్ డివైజ్ రూపకర్తలు