గమనార్హం… ఈ ఇరువురితో ఎవరూ పోటీ పడలేదు
బెంగళూరు: మాజీ ప్రధాని, జేడీ(ఎస్) చీఫ్ హెచ్‌డీ దేవేగౌడ, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికవ్వనున్నారు. కర్ణాటక నుంచి వీరితోపాటు మరో ఇద్దరు బీజేపీ నేతలూ ఏకగ్రీవం కానున్నారు. ఈ నలుగురికి పోటీగా ప్రత్యర్థి పార్టీ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో రాజ్యసభలో వీరు ప్రవేశించడం దాదాపుగా ఖాయమైంది. సొంత పార్టీ జేడీ(ఎస్)తోపాటు కాంగ్రెస్ కూడా సపోర్ట్ చేయడంతో దేవేగౌడ రాజ్యసభకు నామినేషన్ వేశారు. కాగా, రాజ్యసభలో కర్ణాటక నుంచి పార్టీ ప్రతినిధిగా మల్లికార్జున్ […]
బెంగళూరు: మాజీ ప్రధాని, జేడీ(ఎస్) చీఫ్ హెచ్‌డీ దేవేగౌడ, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికవ్వనున్నారు. కర్ణాటక నుంచి వీరితోపాటు మరో ఇద్దరు బీజేపీ నేతలూ ఏకగ్రీవం కానున్నారు. ఈ నలుగురికి పోటీగా ప్రత్యర్థి పార్టీ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో రాజ్యసభలో వీరు ప్రవేశించడం దాదాపుగా ఖాయమైంది. సొంత పార్టీ జేడీ(ఎస్)తోపాటు కాంగ్రెస్ కూడా సపోర్ట్ చేయడంతో దేవేగౌడ రాజ్యసభకు నామినేషన్ వేశారు. కాగా, రాజ్యసభలో కర్ణాటక నుంచి పార్టీ ప్రతినిధిగా మల్లికార్జున్ ఖర్గేను కాంగ్రెస్ ఎంపిక చేసింది. వీరికి పోటీగా అధికారంలోని బీజేపీ అభ్యర్థులను దించకపోవడంతో దేవేగౌడ, మల్లికార్జున్‌లు మళ్లీ రాజ్యసభలో అడుగుపెట్టనున్నారు. కాగా, బీజేపీ నుంచి ఎరన్న కదాడి, అశోక్ గాస్తిలు ఏకగ్రీవంగా పెద్దల సభకు చేరనున్నారు. పెద్దగా గుర్తింపులేని ఈ ఇరువురికీ పోటీగా ఎవ్వరూ పోటీ చేయకపోవడం గమనార్హం.