జర్నలిస్ట్ కోటాలో ‘డబుల్ దందా’..?
దిశ, దేవరుప్పుల: పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండల కేంద్రంలో జర్నలిస్టులకు 11 రెండు పడకల ఇండ్లను జర్నలిస్టు కోటాలో మంత్రి ఎర్రబెల్లి కేటాయించారు. కాగా దేవరుప్పుల మండలంలో 4,5 సంవత్సరాల నుంచి పని చేస్తున్న రిపోర్టర్స్ ను కాదని వేరే ‘జిల్లా’కు సంబంధించిన వ్యక్తికి జర్నలిస్టు కోటాలో ఇల్లు కేటాయించినట్టు ప్రచారం జరుగుతోంది. ఇది అధికారుల నిర్ణయమా.? లేక ప్రజాప్రతినిధుల నిర్ణయమా లేక జర్నలిస్టులు కొంతమంది కలిసి తీసుకున్న నిర్ణయమా అని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. […]
దిశ, దేవరుప్పుల: పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండల కేంద్రంలో జర్నలిస్టులకు 11 రెండు పడకల ఇండ్లను జర్నలిస్టు కోటాలో మంత్రి ఎర్రబెల్లి కేటాయించారు. కాగా దేవరుప్పుల మండలంలో 4,5 సంవత్సరాల నుంచి పని చేస్తున్న రిపోర్టర్స్ ను కాదని వేరే ‘జిల్లా’కు సంబంధించిన వ్యక్తికి జర్నలిస్టు కోటాలో ఇల్లు కేటాయించినట్టు ప్రచారం జరుగుతోంది.
ఇది అధికారుల నిర్ణయమా.? లేక ప్రజాప్రతినిధుల నిర్ణయమా లేక జర్నలిస్టులు కొంతమంది కలిసి తీసుకున్న నిర్ణయమా అని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. స్థానికేతరులకు ఇల్లు కేటాయించినట్టు వార్తలు వస్తుండటంతో దేవరుప్పుల స్థానిక రిపోర్టర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలను త్వరలో మంత్రి ఎర్రబెల్లి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.