రైతు వేదికలపై రాజకీయం సిగ్గుచేటు

దిశ, దేవరకొండ: నిబంధనల మేరకే రైతు వేదికలు నిర్మిస్తున్నట్లు దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రైతుల సంక్షేమం కోసం నియోజకవర్గంలో 26 రైతు వేదికలు నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. రైతు వేదికల నిర్మాణం కోసం మొదటి ప్రాధాన్యతగా దాతలు విరాళంగా ఇచ్చిన స్థలం లేక ప్రభుత్వ భూమి అయి ఉండాలన్నారు. తన దిష్టిబొమ్మ దగ్ధం చేయడం నియోజకవర్గ ప్రజలను అవమానపర్చడమే అని పేర్కొన్నారు. నియోజకవర్గంలో 3వేలు […]

Update: 2020-08-02 06:34 GMT
రైతు వేదికలపై రాజకీయం సిగ్గుచేటు
  • whatsapp icon

దిశ, దేవరకొండ: నిబంధనల మేరకే రైతు వేదికలు నిర్మిస్తున్నట్లు దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రైతుల సంక్షేమం కోసం నియోజకవర్గంలో 26 రైతు వేదికలు నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు.

రైతు వేదికల నిర్మాణం కోసం మొదటి ప్రాధాన్యతగా దాతలు విరాళంగా ఇచ్చిన స్థలం లేక ప్రభుత్వ భూమి అయి ఉండాలన్నారు. తన దిష్టిబొమ్మ దగ్ధం చేయడం నియోజకవర్గ ప్రజలను అవమానపర్చడమే అని పేర్కొన్నారు. నియోజకవర్గంలో 3వేలు ఓట్లు రాని బీజేపీ నేతలు రైతు వేదికలపై రాజకీయం చేయడం సిగ్గు చేటని విమర్శించారు. అంతకముందు దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయుర్వేద వైద్యులు శ్రీ సిరందాసు విశ్వదేవ తయారుచేసిన కరోనా కషాయాన్ని 500 మందికి ఉచితంగా పంపిణీ చేశారు.

Tags:    

Similar News