జగన్ లాంటి నాయకుడు మరొకరు లేరు: డిప్యూటీ సీఎం ధర్మాన
దిశ, ఏపీ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ ఆగర్భ శ్రీమంతుడని చెప్పుకొచ్చారు. జగన్ లాంటి నాయకుడు నభూతో నః భవిష్యత్ అని స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్రానికి జగన్ లాంటి నాయకులు మరోకరు దొరకరని, భవిష్యత్‌లో రాబోరని తేల్చి చెప్పారు. వైఎస్ జగన్‌తో తనకున్న సాన్నిహిత్యంతోనే ఈ మాటలు చెప్తున్నట్లు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి […]
దిశ, ఏపీ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ ఆగర్భ శ్రీమంతుడని చెప్పుకొచ్చారు. జగన్ లాంటి నాయకుడు నభూతో నః భవిష్యత్ అని స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్రానికి జగన్ లాంటి నాయకులు మరోకరు దొరకరని, భవిష్యత్‌లో రాబోరని తేల్చి చెప్పారు. వైఎస్ జగన్‌తో తనకున్న సాన్నిహిత్యంతోనే ఈ మాటలు చెప్తున్నట్లు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి తాను జగన్ వెంట నడిచానని, ఆయన వ్యక్తిత్వం, గొప్ప మనసు తనకే తెలుసన్నారు.
ఈ సందర్భంగా సీఎం జగన్‌పై టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు 70 ఏళ్లు రావడంతో ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదన్నారు. జగన్‌ను విమర్శించడం చంద్రబాబు, టీడీపీ నేతలు మానుకోవాలని హితవు పలికారు. జగన్ అవినీతిపరుడంటున్న చంద్రబాబు.. రెండెకరాలున్న ఆయన ఈ స్థాయికి ఎలా ఎదిగాడో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు, లోకేశ్‌ల వ్యాఖ్యలను చూస్తుంటే తనకు జాలేస్తోందన్నారు. జగన్‌కు, టీడీపీకి నక్కకు నాగ లోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. ఎమ్మెల్యేగా గెలవని లోకేశ్‌కు జగన్‌ను విమర్శించే అర్హత ఎక్కడిదని నిలదీశారు. చంద్రబాబు, లోకేశ్‌లు తలకిందులుగా తపస్సు చేసినా.. జగన్‌ను అందుకోవడం వారి వల్ల కాదని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఎద్దేవా చేశారు.