లడాఖ్‌లో మెరైన్ కమాండోల మోహరింపు
శ్రీనగర్: భారత్, చైనాల మధ్య సరిహద్దు ఘర్షణ కొనసాగుతున్న తరుణంలో ఇండియన్ నేవీకి చెందిన మెరైన్ కమాండోలు(మార్కోస్) తూర్పు లడాఖ్‌లో మోహరించింది. తూర్పు లడాఖ్‌లో ఇప్పటికే భారత ఆర్మీ పారా మిలిటరీ బలగాలు, వైమానిక దళానికి చెందిన గరుడ ఆపరేటివ్‌లు మోహరించి ఉన్నారు. తాజాగా మెరైన్ కమాండోల మోహరింపు నిర్ణయం వెనుక ఈ మూడు బలగాల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం లక్ష్యంగా ఉన్నదని తెలిసింది. అలాగే, అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతల్లోనూ విధులు నిర్వహించే సమర్థతను మరింత పెంచుకునే […]
శ్రీనగర్: భారత్, చైనాల మధ్య సరిహద్దు ఘర్షణ కొనసాగుతున్న తరుణంలో ఇండియన్ నేవీకి చెందిన మెరైన్ కమాండోలు(మార్కోస్) తూర్పు లడాఖ్‌లో మోహరించింది. తూర్పు లడాఖ్‌లో ఇప్పటికే భారత ఆర్మీ పారా మిలిటరీ బలగాలు, వైమానిక దళానికి చెందిన గరుడ ఆపరేటివ్‌లు మోహరించి ఉన్నారు. తాజాగా మెరైన్ కమాండోల మోహరింపు నిర్ణయం వెనుక ఈ మూడు బలగాల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం లక్ష్యంగా ఉన్నదని తెలిసింది. అలాగే, అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతల్లోనూ విధులు నిర్వహించే సమర్థతను మరింత పెంచుకునే అవకాశంగానూ దీన్ని మలుచుకుంటున్నారని సంబంధితవర్గాలు తెలిపాయి. ప్యాంగాంగ్ సరస్సు ఏరియాలో మార్కోస్‌లను మోహరించినట్టు వివరించాయి. ప్రస్తుతం ఆ సరస్సులో నేవీకి మౌలిక వసతులకు అదనంగా కొత్త పడవలను ప్రభుత్వం అందించనున్నట్టు వెల్లడించాయి.