నాలుగేండ్ల కిందట.. సరిగ్గా ఈరోజు ఏమైందో తెలుసా!
దిశ, వెబ్‌డెస్క్ : సరిగ్గా నాలుగేళ్ల కిందట ఇదే రోజున కేంద్ర ప్రభుత్వం దేశాన్ని కుదిపేసే నిర్ణయం తీసుకుంది. దేశంలో పేరుకుపోయిన బ్లాక్ మనీ, నకిలీ కరెన్సీని వెలికితీసే క్రమంలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం అప్పట్లో పెను సంచలనం రేపింది. 2016 నవంబర్ 8 సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో మీడియా సమక్షంలో పెద్ద నోట్ల రద్దును కేంద్రం ప్రకటించింది. రూ.1000, 500 నోట్లను బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించింది. 2014 సార్వత్రిక […]
దిశ, వెబ్‌డెస్క్ : సరిగ్గా నాలుగేళ్ల కిందట ఇదే రోజున కేంద్ర ప్రభుత్వం దేశాన్ని కుదిపేసే నిర్ణయం తీసుకుంది. దేశంలో పేరుకుపోయిన బ్లాక్ మనీ, నకిలీ కరెన్సీని వెలికితీసే క్రమంలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం అప్పట్లో పెను సంచలనం రేపింది. 2016 నవంబర్ 8 సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో మీడియా సమక్షంలో పెద్ద నోట్ల రద్దును కేంద్రం ప్రకటించింది. రూ.1000, 500 నోట్లను బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో కరప్షన్ లేని భారతాన్ని నిర్మిస్తామని మోడీ ఇచ్చిన హామీ మేరకు పెద్ద నోట్లను రద్దు నిర్ణయం తీసుకున్నట్లు బీజేపీ నేతలు సమర్థించుకున్నారు. కాగా, ఈ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. కాంగ్రెస్ పార్టీ అయితే ‘నోట్ల రద్దు’నిర్ణయాన్ని చరిత్రలో ఇదొక బ్లాక్ డేగా వర్ణించింది. దీనికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున జరిగాయి.
నోట్ల రద్దు ప్రకటన అనంతరం డిసెంబర్ -31వరకు తమ వద్దనున్న రూ.1000,500నోట్లను బ్యాంకుల్లో మార్పిడి చేయించుకోవాలని కేంద్రం దేశ ప్రజలకు సూచించింది. మోడీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అప్పట్లో కొందరు సమర్థించగా, ఆర్థిక నిపుణులు, పలువురు రాజకీయ ప్రముఖులు మాత్రం ముక్త కంఠంతో వ్యతిరేకించారు. అయితే, ముందస్తు ప్లానింగ్ లేకుండా నోట్లను రద్దు చేయడం ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని నాటి రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురామ్ రాజన్ హెచ్చరించినా కేంద్రం వినిపించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించిందని కథనాలు వెలువడ్డాయి.
నోట్ల రద్దు తర్వాత బడా వ్యాపారవేత్తలు, సినీ, రాజకీయ ప్రముఖులు, పన్ను ఎగవేతదారులపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపలేదని, కానీ సామాన్యుడి జీవితాన్ని మాత్రం చిన్నాభిన్నం చేసిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. కారణం, డబ్బులున్న బడా వ్యాపారవేత్తలు ఎవరూ బ్యాంకులకు నేరుగా వచ్చి నోట్లు మార్చుకోలేదని.. పేద, సామాన్య ప్రజలు మాత్రం పొద్దున నుంచి సాయంత్రం వరకు కిలో మేటర్ల మేర బ్యాంకులు, ఏటీఎం సెంటర్ల వద్ద క్యూలైన్లలో నెలల తరబడి పడిగాపులుగాశారని విమర్శించింది. నోట్ల రద్దు నిర్ణయం వలన దేశ జీడీపీ అట్టడుకు స్థాయికి పడిపోయింది. నిరుద్యోగం, పేదరికం పెరిగిందని పలు సర్వేలు సైతం వెల్లడించాయి. ముఖ్యంగా చిరు వ్యాపారులను, వర్తకులకు నోట్ల రద్దు అంశం శాపంగా మారింది.
ఇదిలాఉండగా, పెద్దనోట్ల రద్దు ప్రకటించిన కేంద్రం తిరిగి రూ.500, 2000వేల కొత్త నోట్లను ప్రింటింగ్ చేయడంపై కూడా దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. సరిపడినంతా కరెన్సీ ముందుగా ముద్రించకముందే ఎందుకు నోట్లు రద్దు ప్రకటించారని సామాన్యులు సైతం కేంద్రంపై నిప్పులు చెరిగారు. పెద్దనోట్ల వల్లే బ్లాక్ మనీ నిల్వలు పెరిగిపోయాయని చెప్పిన ప్రధాని రూ.2000వేల నోటును తీసుకొస్తే మళ్లీ నల్లధనం నిల్వలు పెరగవా అని సందేహాలను కేంద్రం ముందుంచారు. వీటిపై నాడు కేంద్రం స్పష్టమైన క్లారిటీ ఇవ్వలేకపోయింది. తీరా 2018లో రూ.15.41లక్షల కోట్లు (99.3 శాతం) కరెన్సీ ఆర్బీఐ వద్దకు తిరిగి చేరుకుందని.. రూ.10,720 కోట్లు మాత్రం బ్యాంకుల్లో డిపాజిట్ కాలేదని తేలింది. ఈ పరిణామంతో నోట్లరద్దు ప్రక్రియ బిగ్గెస్ట్ ఫెయిల్యూర్‌గా మిగిలిపోగా, జీడీపీలో దేశీయ ఉత్పత్తి రంగం వాటా భారీగా కుదేలైందని జాతీయ, అంతర్జాతీయ సర్వేలు స్పష్టంచేశాయి. కాగా, ఈ నోట్ల రద్దు నిర్ణయం దేశంలో ఇదే మొదటిసారి కాదు. 1946, 1978 మధ్యలో కూడా జరిగింది. స్వాతంత్ర్యనంతరం తొలిసారి అధికారంలోకి వచ్చిన నాటి జనతా అలయన్స్ ప్రభుత్వం కూడా బ్లాక్ మనీ నిర్మూలనే ధ్యేయంగా రూ. 5000, 10000వేల నోట్లను రద్దు చేసినట్లు తెలుస్తోంది.
ఏదైమెనా పెద్దనోట్లు రద్దు అంశం ఇప్పటికీ భారతీయులకు ఒక పీడకలగా మిగిలిపోతుంది. అదంతా ఓవైపైతే డీమానిటైజేషన్ తర్వాత దేశంలో నగదు రహిత లావాదేవీలు పెరిగాయని చెప్పవచ్చు. డిజిటల్ ట్రాస్పరెన్సీ పెరిగింది. బడ్డికొట్టు నుంచి బ్యాంకు లావాదేవీలు ప్రస్తుతం ఆన్ లైన్‌లోనే ఎక్కువగా జరుగుతున్నాయి. చాలా మందికి ఆన్‌లైన్ యాప్‌ల ద్వారా నగదు ఎలా పంపించుకోవాలనే దానిపై అవగాహన వచ్చింది. భద్రత కూడా పెరిగిందని చెప్పవచ్చు. మొత్తంగా ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయం వలన దేశంలో ఒకేసారి రెండు పెను మార్పులు సంభవించాయని చెప్పుకోవచ్చు.