కథ కన్నా బూతుకే డిమాండ్: ఓటీటీ !

కంటెంట్ ఈజ్ కింగ్ అంటుంటారు, కానీ బూతు కంటెంట్ మాత్రం ఎల్లప్పుడూ కింగ్ అని చెప్పుకోవచ్చు. పురాతన కాలంలో దేవాలయాల మీద బొమ్మల దగ్గర నుంచి నేడు అర్థరాత్రి పూట దుప్పటి కప్పుకుని కుడిచేతిలో ఫోన్ పట్టుకుని చూసే బొమ్మల వరకు బూతు కంటెంట్ రాజ్యాన్ని ఏలుతూనే ఉంది. అయితే బూతు కంటెంట్‌కు ఆదరణ విషయంలో ఎలాంటి కొదువలేకున్నా ప్రజెంటేషన్ విషయంలో మాత్రం.. నాటికీ నేటికీ చాలా మార్పులు వచ్చాయి. 80 – 90 దశకాల్లో హీరో, […]

Update: 2020-08-30 01:26 GMT

కంటెంట్ ఈజ్ కింగ్ అంటుంటారు, కానీ బూతు కంటెంట్ మాత్రం ఎల్లప్పుడూ కింగ్ అని చెప్పుకోవచ్చు. పురాతన కాలంలో దేవాలయాల మీద బొమ్మల దగ్గర నుంచి నేడు అర్థరాత్రి పూట దుప్పటి కప్పుకుని కుడిచేతిలో ఫోన్ పట్టుకుని చూసే బొమ్మల వరకు బూతు కంటెంట్ రాజ్యాన్ని ఏలుతూనే ఉంది. అయితే బూతు కంటెంట్‌కు ఆదరణ విషయంలో ఎలాంటి కొదువలేకున్నా ప్రజెంటేషన్ విషయంలో మాత్రం.. నాటికీ నేటికీ చాలా మార్పులు వచ్చాయి. 80 – 90 దశకాల్లో హీరో, హీరోయిన్ ముద్దు పెట్టుకునే సన్నివేశాల్లో పువ్వులను అడ్డంగా పెట్టేవాళ్లు. ఇప్పుడు పువ్వులు అవసరమైన చోట కూడా హీరోయిన్‌ను పెట్టేస్తున్నారు. అలాగని మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో బూతు కంటెంట్ ఎక్కువగా పెడుతున్నారని అనుకోవద్దు. మెయిన్ స్ట్రీమ్ తెలుగు సినిమాలు ప్రస్తుతానికి ముద్దు వరకే పరిమితమయ్యాయి. కానీ కొవిడ్ కారణంగా ఒక విప్లవంలా దూసుకొచ్చిన ఓటీటీలు బూతు కంటెంట్‌కు జేజేలు పలుకుతున్నాయి. ఇక్కడ అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్ వంటి అంతర్జాతీయ స్థాయి స్ట్రీమింగ్ గురించి మాట్లాడటం లేదు. వీటిలో కూడా బూతు కంటెంట్ ఉంది, కానీ కథకు ప్రాధాన్యమున్న చోట మాత్రమే కావాల్సిన విధంగా చూపించే బూతు కంటెంట్‌కు ఇవి ప్రాధాన్యతనిస్తాయి. ఇవి కాకుండా కొన్ని దేశీ స్ట్రీమింగ్ సర్వీస్‌లు ఉన్నాయి. వీటిలో మాత్రం మొదటి ప్రాధాన్యత బూతు కంటెంట్, తర్వాతే కథ.

ఆల్ట్ బాలాజీ, ఉల్లూ, కుకూ, ప్రైమ్‌ఫ్లిక్స్, హాట్‌షాట్స్, ఎంఎక్స్ ప్లేయర్.. ఈ యాప్‌ల పేర్లు వినే ఉంటారు. నిజానికి ఉపయోగించే ఉంటారు, కానీ చెప్పుకోవడానికి కాస్త ఇబ్బంది పడతారు. పూర్తిగా విప్పేసే విదేశీ కంటెంట్ కంటే.. చూపించి చూపించనట్లుగా, కవ్వించీ కవ్వించనట్లుగా ఉండే దేశీ కంటెంట్‌ మీదే భారతీయులు ఆసక్తి చూపుతారని ఈ లాక్‌డౌన్ సమయంలోనే రుజువైంది. మెయిన్ స్ట్రీమ్ సినిమాలు, ఆలోచింపజేసే కంటెంట్‌తో ఉన్న టీవీ షోలను పెద్దగా ఇష్టపడని వాళ్లు అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ లాంటి యాప్‌ల జోలికి వెళ్లరు. వాళ్లకు కావాల్సిందల్లా వాళ్ల భాషలో వాళ్ల చుట్టూ జరిగే కథలతో వారు కోరుకున్న మసాలా ఉన్న కంటెంట్. సరిగ్గా అలాంటి కంటెంట్‌నే ఈ యాప్‌లు అందిస్తున్నాయి. అందుకే లాక్‌డౌన్ సమయంలో ఈ ఆల్ట్ బాలాజీ యాప్ సబ్‌స్క్రిప్షన్‌లు 60 శాతం పెరిగాయి. నిజానికి ఆల్ట్ బాలాజీ స్ట్రీమింగ్ సర్వీస్ గురించి ఇక్కడ ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి.

హిందీ టెలివిజన్ రంగంలో ఏక్తా కపూర్ ఒక బ్రాండ్. బాలాజీ టెలీఫిలింస్ అనగానే అత్తలు, కోడళ్లు, భార్యలు, భర్తలు, అనుమానాలు, ఓవర్ యాక్షన్‌లు, వేల సంఖ్యలో ఎపిసోడ్‌లు ఇవి మాత్రమే గుర్తొచ్చేవి. ఆ ఇమేజ్ పోగొట్టుకోవాలనుకున్నారో ఏమో ‘ఆల్ట్ బాలాజీ’ పేరుతో ఇలా బూతు కంటెంట్‌కు ప్రాధాన్యమిచ్చే స్ట్రీమింగ్ సర్వీస్‌ను ఏక్తా కపూర్ ఆవిష్కరించారు. ఇందులో గందీ బాత్ (బూతు మాటలు) అనే సిరీస్ ఉంటుంది. గ్రామీణ భారతంలో జరిగే శృంగార రాసలీలల కథలే లక్ష్యంగా ఈ ఎపిసోడ్‌లు ఉంటాయి. అంటే మామతో అక్రమ సంబంధం, ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య, కీచక మేనమామ.. ఇలాంటి హెడ్డింగ్‌లకు న్యాయం చేసే కథలన్నమాట. సెడెక్షన్ అంశాన్ని ఎంతో ఇష్టంగా చూసే భారతీయులు ఈ సిరీస్‌కు బాగా దగ్గరయ్యారు. అందుకే ఇప్పటికే నాలుగు సీజన్‌లు వచ్చాయి. ఇవి మాత్రమే కాకుండా చిన్న పిల్లలకు సెక్స్ ఎడ్యుకేషన్ నేర్పించే ఎన్నో షోలు కూడా ఆల్ట్ బాలాజీలో ఉన్నాయి.

‘గందీ బాత్’ వల్ల ఆల్ట్ బాలాజీకి వచ్చిన ఆదరణను గమనించిన చిన్న చిన్న ప్రొడక్షన్ సంస్థలు కూడా ఇలాంటి కంటెంట్‌తో సొంతంగా స్ట్రీమింగ్ యాప్‌లను విడుదల చేశాయి. ఆ క్రమంలో వచ్చినవే ‘ఉల్లూ, కుకూ, ప్రైమ్‌ఫ్లిక్స్, హాట్‌షాట్స్’. తక్కువ బడ్జెట్, తక్కువ మాటలు, ఎక్కువ పని, ఒకటే మ్యూజిక్కు, పెద్దగా నటించాల్సిన అవసరం లేదు, అనుభవం ఉన్న నటులు అక్కర్లేదు, నటీమణులు కొంచెం ధైర్యం చేస్తే చాలు, ఉండాల్సినవి ఉండాల్సిన చోట ఉండాల్సిన విధంగా ఉంటే మరీ మంచిది. ఈ రకంగా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి, నెలకు కనీసం రెండు కొత్త షోలను ఈ యాప్‌లు విడుదల చేయగలుగుతున్నాయి. ఈ యాప్‌లను చూసి బోల్డ్ కంటెంట్‌తో ముందుకొచ్చిన ఎంఎక్స్ ప్లేయర్ కూడా ఇలాంటి కంటెంట్‌కు మారింది. ఇటీవల అందులో విడుదలైన ‘మస్త్రం’ ప్రోగ్రామ్‌కు ఏకంగా 20 మిలియన్‌ల వ్యూస్ వచ్చాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు జీ5, వూట్ యాప్‌లు కూడా ఈ కంటెంట్‌తో ఒరిజినల్ కార్యక్రమాలను తీసుకొస్తున్నాయి.

మరి నిజంగా వీటిలో పూర్తిగా బూతు వీడియోలు ఉంటాయా? అంటే ఉండవనే సమాధానం చెప్పాలి. ఎందుకంటే సాధారణంగా పోర్న్ వీడియో చూసేటపుడు కూడా ముందు 3 నిమిషాలు పూర్తిగా చూసి నేరుగా చివరి నిమిషాలకు ఫార్వర్డ్ చేస్తుంటారు. ఆ ముందు మూడు నిమిషాలనే ఈ స్ట్రీమింగ్ సర్వీస్‌లు క్యాష్ చేసుకుంటున్నాయి. పెద్దగా న్యూడిటీ ఉండదు, నేరుగా కెమెరా యాంగిల్స్ ఉండవు, కేవలం హావభావాలు, కవ్వింపులు, డబుల్ మీనింగ్ డైలాగులు.. ఇవి మాత్రమే ఉంటాయి. ఒక వీక్షకుడిని ఊహాలోకంలో విహరింపజేస్తూ, చుక్కల అంచుల వరకు తీసుకెళ్లడానికి ఇవి చాలు కదా!

మరి పూర్తిగా ఇలాంటి కంటెంట్‌తో యాప్‌లు ఉండటం వల్ల పిల్లలు చెడిపోరా? అనే ప్రశ్న తలెత్తవచ్చు. అయితే మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో మొదటి ముద్దు సీన్ చూపించిన దగ్గరి నుంచి, సన్నీ లియోన్ సినిమాల్లో కనిపించినప్పటి వరకు ఇలాంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కానీ పెద్దగా పట్టించుకోరు. ఇలాంటి ప్రశ్నలు సంధించిన వారే రేపు స్వలింగ సంపర్కుల హక్కుల కోసం పోరాడుతారు. ఎవరో చెప్పినట్లుగా ‘శృంగారం గురించి మాట్లాడటానికి సిగ్గు పడతారు కానీ దేశ జనాభా 120 కోట్లు..’ ఇది కూడా అంతే.. క్షణికావేశంలో మానభంగాలు చేసి బతుకు పాడు చేసుకునే బదులు ఇలాంటి కంటెంట్‌తో సంతృప్తి పొందడంలో తప్పేం లేదని మానసిక విశ్లేషకుల అభిప్రాయం. 14 ఏళ్ల పిల్లాడు బూతు సినిమాలు చూస్తూ తల్లిదండ్రులకు దొరికితే వాడిని చితకబాదుతారు, కానీ అదే పిల్లాడు 35 ఏళ్ల మగాడయ్యాక కూడా పిల్లల్ని కనకపోతే కోడల్ని రాచిరంపాన పెడతారు. కాబట్టి బూతు కంటెంట్ తప్పు కాదు, దాన్ని అర్థం చేసుకునే విధానం తప్పు!

Tags:    

Similar News