ట్రంప్‌కు అర్హత లేదు : బైడెన్

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో అధ్యక్ష రేసులో ఉన్న అభ్యర్థులు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ట్రంప్ వైఫల్యం వల్లే కరోనా కేసుల్లో అమెరికా ముందుందని తెలిపారు. కరోనాతో అమెరికాలో మరింతమంది చనిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికాలో […]

Update: 2020-10-22 20:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో అధ్యక్ష రేసులో ఉన్న అభ్యర్థులు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ట్రంప్ వైఫల్యం వల్లే కరోనా కేసుల్లో అమెరికా ముందుందని తెలిపారు.

కరోనాతో అమెరికాలో మరింతమంది చనిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికాలో కరోనా మరణాలు ఇప్పటికే రెండు లక్షలు దాటాయని వెల్లడించారు. దీంతో ట్రంప్‌కు అమెరికా అధ్యక్షుడిగా కొనసాగే అర్హత లేదని ఎద్దేవా చేశారు. కరోనాకు కారణం చైనానే అని సంచలన ఆరోపణలు చేశారు.

Tags:    

Similar News