ఢిల్లీలో వడగండ్ల వాన

న్యూఢిల్లీ: గురువారం సాయంత్రం ఢిల్లీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉన్నట్టుండి దట్టంగా మేఘాలు ఆవరించాయి. ఈదురుగాలు బలంగా వీచాయి. ఈ గాలులతోనే నిమిషాల వ్యవధిలోనే వడగండ్ల వాన కురిసింది. ఈ భారీ వర్షం ఢిల్లీ నగరం, ఘజియాబాద్, నోయిడాలలో కురిసింది. దీంతో కొన్నిచోట్ల చెట్లు విరిగిపోయాయి. రోడ్లు, భవంతుల టెర్రస్‌లపై తెల్లని వడగండ్లు దర్శనమిచ్చాయి. ఊహించని ఈ వర్షానికి నగర పౌరులు పులకించిపోయారు. ఇది వేసవి కాలమేనా? అని సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేసుకున్నారు.

Update: 2020-05-14 09:41 GMT

Tags:    

Similar News