కరోనా కట్టడికి ఢిల్లీ ప్రభుత్వం ఆపరేషన్ షీల్డ్
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలోని 21 ప్రాంతాల్లో కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఓ విధానాన్ని ప్రకటించారు. ఆపరేషన్ షీల్డ్ (Operation S.H.I.E.L.D) అని పిలిచే ఈ విధానంలో పాటించాల్సిన ఆరు కార్యాచరణ సూత్రాలను వెల్లడించారు. ఇందులో ఎస్ అంటే సీలింగ్ ఆఫ్ ఇమ్మిడియెట్ ఏరియా… అంటే ఉన్నపళంగా కరోనా ప్రాంతంగా గుర్తించిన ప్రదేశం చుట్టుపక్కల ప్రాంతాలను అష్టదిగ్భందనం చేయాలి. హెచ్ అంటే హోమ్ క్వారంటైన్… అంటే ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న వారందరూ […]
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలోని 21 ప్రాంతాల్లో కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఓ విధానాన్ని ప్రకటించారు. ఆపరేషన్ షీల్డ్ (Operation S.H.I.E.L.D) అని పిలిచే ఈ విధానంలో పాటించాల్సిన ఆరు కార్యాచరణ సూత్రాలను వెల్లడించారు.
ఇందులో ఎస్ అంటే సీలింగ్ ఆఫ్ ఇమ్మిడియెట్ ఏరియా… అంటే ఉన్నపళంగా కరోనా ప్రాంతంగా గుర్తించిన ప్రదేశం చుట్టుపక్కల ప్రాంతాలను అష్టదిగ్భందనం చేయాలి. హెచ్ అంటే హోమ్ క్వారంటైన్… అంటే ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న వారందరూ కచ్చితంగా ఇళ్ల నుంచి బయటికి అడుగుపెట్టకుండా చూడాలి. ఐ అంటే ఐసోలేషన్… అంటే కరోనా పాజిటివ్‌గా గుర్తించిన వారిని వెంటనే ఐసోలేట్ చేయాలి. ఈ అంటే ఎసెన్షియల్ సప్లై… అంటే నిత్యావసర వస్తువులను ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న వారి ఇళ్లకు వెళ్లి అందజేయాలి. ఎల్ అంటే లోకల్ శానిటైజేషన్… అంటే స్థానిక ప్రభుత్వాలు ఆయా ప్రాంతాల్లోని అన్ని ముఖ్యమైన ప్రదేశాలు, రోడ్లు, ఇళ్లు శానిటైజ్ చేయాలి. డి అంటే డోర్ టు డోర్… అంటే ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఇంటికి వెళ్లి ఆరోగ్య సర్వే చేసి వారి పరిస్థితిని ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలి.
అయితే ఇప్పటివరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ కట్టడి చేయడానికి దాదాపు ఇలాంటి కార్యాచరణనే అమలు చేస్తున్నప్పటికీ ఇలా దానికి ఒక పేరు పెట్టడం వల్ల సోషల్ మీడియాలో షేర్ చేయడానికి వీలుగా ఉండి త్వరగా అవగాహన పెంచే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Tags: Delhi, Operation Shield, Corona, Covid 19, Arvind Kejriwal