ఢిల్లీలో స్కూళ్లు, థియేటర్‌లు బంద్

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31వరకు విద్యాసంస్థలు, సినిమా థియేటర్లను మూసివేయాలని ఆదేశించింది. అలాగే, ఈ వైరస్ సోకకుండా అన్ని కార్యాలయాల్లోనూ తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఢిల్లీలో పాటు కేరళ ప్రభుత్వం సైతం స్కూళ్లు, థియేటర్లను 31వరకు మూసివేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఏపీలో తొలి కరోనా కేసు నెల్లూరులో నమోదవ్వడంతో జిల్లావ్యాప్తంగా సినిమా థియేటర్లను […]

Update: 2020-03-12 19:49 GMT

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31వరకు విద్యాసంస్థలు, సినిమా థియేటర్లను మూసివేయాలని ఆదేశించింది. అలాగే, ఈ వైరస్ సోకకుండా అన్ని కార్యాలయాల్లోనూ తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఢిల్లీలో పాటు కేరళ ప్రభుత్వం సైతం స్కూళ్లు, థియేటర్లను 31వరకు మూసివేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఏపీలో తొలి కరోనా కేసు నెల్లూరులో నమోదవ్వడంతో జిల్లావ్యాప్తంగా సినిమా థియేటర్లను మూసివేయాలని కలెక్టర్ ఆదేశించారు. కాగా, దేశంలో కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 74కు చేరింది.

tags: delhi, govt, schools, theatres, corona, spread, covid-19, kejriwal

Tags:    

Similar News