చేతులు జోడించి ప్రార్థిస్తున్నా… :కేజ్రీవాల్

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని చేతులు జోడించి ప్రార్థిస్తున్నట్టు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. కొత్త చట్టాలతో కార్పొరేట్లకే లబ్ది చేకూరుతుందని పేర్కొన్నారు. వేలాది మంది రైతులు ఆందోళనలు చేస్తున్న సింఘు సరిహద్దుకు కేజ్రీవాల్ ఆదివారం వెళ్లారు. రైతులనుద్దేశించి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. నూతన సాగు చట్టాలు అన్నదాతలకు మేలు చేస్తున్నాయా? కీడు చేస్తున్నాయా? అనే అంశం తెలుసుకోవడానికి ఏ కేంద్రమంత్రి అయినా సరే రైతులతో నేరుగా […]

Update: 2020-12-27 11:53 GMT

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని చేతులు జోడించి ప్రార్థిస్తున్నట్టు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. కొత్త చట్టాలతో కార్పొరేట్లకే లబ్ది చేకూరుతుందని పేర్కొన్నారు. వేలాది మంది రైతులు ఆందోళనలు చేస్తున్న సింఘు సరిహద్దుకు కేజ్రీవాల్ ఆదివారం వెళ్లారు. రైతులనుద్దేశించి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. నూతన సాగు చట్టాలు అన్నదాతలకు మేలు చేస్తున్నాయా? కీడు చేస్తున్నాయా? అనే అంశం తెలుసుకోవడానికి ఏ కేంద్రమంత్రి అయినా సరే రైతులతో నేరుగా చర్చించగలరా అని సవాల్ విసిరారు. మద్దతు ధరపై మాట్లాడుతున్న ఎన్‌డీఏ నేతలను విమర్శించారు. ‘భూములు పోవని, మద్దతు ధరకు ఏమీ కాదని వారంటున్నారు. కొత్త చట్టాల ప్రయోజనాలు ఇవేనా? ఇవి ఎప్పటి నుంచో ఉన్నవే కదా? అంతమాత్రానికి మీరు కొత్త చట్టాలు ఎందుకు చేశారు? ఆ చట్ట ప్రతులను చింపి పడేయండి’ అని విమర్శించారు.

Tags:    

Similar News