జీతాలియ్యాలే.. రూ. 5,000 కోట్లు ఇవ్వండి: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ సర్కారు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారాన్ని కోరింది. తమ ఉద్యోగులకు వేతనాలు ఇచ్చేందుకు రూ. 5,000 కోట్లు అందించాలని విజ్ఞప్తి చేసింది. ఈ ఆపత్కాలంలో ఢిల్లీ ప్రజలకు సహాయం చేయాలని కేంద్ర సర్కారును అభ్యర్థిస్తున్నట్టు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఢిల్లీ ఆర్థిక వ్యవహారాలు చూస్తున్న మంత్రి మనీష్ సిసోడియా కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. మిగతా రాష్ట్రాలకు అందినట్టు ఢిల్లీకి విపత్తు సహాయం అందలేదని, అందుకే రూ. 5,000 […]
న్యూఢిల్లీ: ఢిల్లీ సర్కారు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారాన్ని కోరింది. తమ ఉద్యోగులకు వేతనాలు ఇచ్చేందుకు రూ. 5,000 కోట్లు అందించాలని విజ్ఞప్తి చేసింది. ఈ ఆపత్కాలంలో ఢిల్లీ ప్రజలకు సహాయం చేయాలని కేంద్ర సర్కారును అభ్యర్థిస్తున్నట్టు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఢిల్లీ ఆర్థిక వ్యవహారాలు చూస్తున్న మంత్రి మనీష్ సిసోడియా కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. మిగతా రాష్ట్రాలకు అందినట్టు ఢిల్లీకి విపత్తు సహాయం అందలేదని, అందుకే రూ. 5,000 కోట్లు ఆర్థిక సహాయాన్ని అందించాలని కేంద్రాన్ని కోరినట్టు తెలిపారు. ఢిల్లీ ఒక నెల జీతాలు చెల్లించేందుకు రూ.3,500 కోట్లు అవసరం. రెండు నెలలుగా జీఎస్టీ కలెక్షన్లు రూ. 500 కోట్ల చొప్పున వసూలయ్యాయని, ఇప్పుడు వేతనాలందించేందుకు రూ. 7,000 కోట్లు అవసరమని మనీష్ సిసోడియా వివరించారు.